Site icon NTV Telugu

India-Pakistan War: యుద్ధ బరిలోకి INS విక్రాంత్.. కరాచీ నౌకాశ్రయంలో విధ్వంసం?

Ins Vitranth

Ins Vitranth

పాకిస్థాన్ దుశ్చర్య తర్వాత భారత నావికాదళం రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో మోహరించిన INS విక్రాంత్ యుద్ధ బరిలోకి దిగింది. పాకిస్థాన్‌లో ప్రధాన నగరమైన కరాచీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ.. విధ్వంసం సృష్టిస్తోంది. ఈ దాడి అనంతరం కరాచీ ఓడరేవులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ భీకర దాడిలో కరాచీ నౌకాశ్రయం విధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఓడరేవుతో పాటు కరాచీ నగరంలోని పలు చోట్ల భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో పాకిస్థాన్ భయాందోళనల్లో మునిగి పోయింది. తాజా సమాచారం ప్రకారం.. పాకిస్థాన్‌లోని కరాచీ, ఒర్మారా ఓడరేవులపై ఐఎన్ఎస్ విక్రాంత్ అనేక క్షిపణులను ప్రయోగించింది. దీంతో రెండు ఓడరేవులలో భారీ మంటలు చెలరేగాయి. రెండు ఓడరేవు నగరాల చుట్టూ పొగ వ్యాపించింది. దాడుల నేపథ్యంలో ప్రజలు భయాందోళనలను గురవుతున్నారు. స్థానికంగా ఉన్న బంకర్లలోకి పరుగులు పెడుతున్నారు.

READ MORE: India-Pakistan War: భయం గుప్పిట్లో పాక్.. లాహోర్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై భీకర దాడి..

వాస్తవానికి.. 1971 తర్వాత కరాచీ పోర్టును భారత్ లక్ష్యంగా చేసుకుంది. పాకిస్థాన్‌కి చెందిన నావికాదళానికి కరాచీ, ఒర్మారాలో స్థావరాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలతో పాటు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఇదే ప్రదేశంలో ఉంచారు. ఈ దాడిలో అవన్నీ చాలా మట్టుకు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన INS విక్రాంత్ పాకిస్థాన్‌ను మట్టికరిపించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

READ MORE: Big News : జమ్మూలో బ్లాక్ అవుట్ ఎత్తివేత..

వాస్తవానికి.. ఐఎన్ఎస్ విక్రాంత్ కొచ్చి నౌకాశ్రయంలో నిర్మించారు. ఈ వాహక నౌకను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2022న జాతికి అంకితం చేశారు. ఇది ఒక భారతీయ సంస్థ నిర్మించిన తొలి దేశీయ విమాన వాహక నౌక. వందకు పైగా భారతీయ చిన్న, మధ్యతరహా సంస్థల సహకారంతో ఈ నౌకను నిర్మించారు. 2022 వరకు భారత్ వద్ద ఒకే ఒక్క విమాన వాహక నౌక అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇండియన్ నేవీకి ఇలాంటివి రెండు ఉన్నాయి. దీంతో సొంతంగా విమాన వాహక నౌకలను నిర్మిస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా చైనా వంటి దేశాల సరసన భారత్ కూడా చేరినట్లయింది. భారత్‌లో నిర్మించిన ఈ నౌకకు 1971లో పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ పేరే పెట్టారు.

Exit mobile version