Bandla Ganesh Supports Nara Chandrabaabu Naidu: టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు అయి రాజమండ్రి జెయిల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు ఖండిస్తూ ఆయనకు మద్దతుగా టీడీపీ, ప్రతిపక్ష నేతలతో పాటు ఐటీ ఉద్యోగులు, టిడిపి ఎన్నారై విభాగం నేతలు నిరసనలు కూడా చేపట్టారు. ఇక సినీ రంగం నుంచి కూడా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రముఖ నిర్మాత అశ్వినీదత్, ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావుతో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తనదైన రీతిలో కామెంట్లు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తనను ఎంతో బాధించిందని పేర్కొన్న బండ్ల ఆ బాధలో తాను ఇంట్లో వినాయక చవితి వేడుకలు జరుపుకోలేదని బాధపడ్డారు.
PAPA: తమిళంలో దా…దా.. తెలుగులో పా…పా.. ఫస్ట్ లుక్ చూశారా?
చంద్రబాబు జైల్లో ఇబ్బంది పడుతుంటే తనకు అన్నం కూడా తిన బుద్ధి కావడం లేదని బండ్ల వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధించి చంద్రబాబు మరో మరోసారి సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పిన బండ్ల గణేష్ చంద్రబాబు జాతీయ సంపదని, ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. చంద్రబాబు పేరు చెప్పుకొని ఎంతోమంది బాగుపడ్డారని,అయితే ఐటి ఉద్యోగులు హైదరాబాదులో రోడ్డుపై కాకుండా నెల రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి సొంతూళ్లో బొడ్రాయి ముందు ధర్నా చేయాలని బండ్ల కామెంట్ చేశారు. బాబు అరెస్టు తనను ఎంతో బాధపెట్టిందని అందుకే ఈ సారి వినాయక చవితి వేడుకలను తన ఇంట్లో నిర్వహించుకోలేదని అన్నారు. ఇక గతంలో కాంగ్రెస్ లో చేరి కొన్నాళ్ళు సైలెంట్ అయిన బండ్ల తనకు తాను పవన్ భక్తుడిగా ప్రకటించుకున్నారు. అలాంటి ఆయన చంద్రబాబుకు మద్దతుగా కామెంట్లు చేయడం గమనార్హం.