7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infinix Smart 20 Launch: భారత మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఇన్ఫినిక్స్ (Infinix) నుండి కొత్తగా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 (Infinix Smart 20) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇదివరకు వచ్చిన స్మార్ట్ 10కు అప్డేటెడ్ గా ఈ ఫోన్‌ను తీసుకొచ్చిన కంపెనీ.. డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ వంటి విభాగాల్లో అప్గ్రేడ్లను తీసుకవచ్చింది.
డిజైన్, పెద్ద డిస్ప్లే:
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 కేవలం 7.7 మిల్లీమీటర్ల మందంతో స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో 3D టెక్స్చర్ కంపోజిట్ ఫినిష్ను అందించారు. ముందు భాగంలో 6.78 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేను ఇవ్వగా.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లేలో సెంటర్ పంచ్-హోల్ డిజైన్‌తో పాటు నోటిఫికేషన్లు, స్టేటస్ అప్డేట్స్ను చూపించే “డైనమిక్ బార్” ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
Also Read
- 6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
- 8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
- Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
- 30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
ప్రాసెసర్:
పనితీరు విషయానికి వస్తే.. ఈ ఫోన్లో 12nm టెక్నాలజీ ఆధారిత మెడియటేక్ హీలియో G81 అల్టిమేట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. దీనికి 4GB LPDDR4X ర్యామ్‌ను ఇవ్వగా.. అలాగే మెమ్‌ఫ్యూజన్ (MemFusion) టెక్నాలజీ ద్వారా మరో 4GB వరకు వర్చువల్ ర్యామ్‌ను పెంచుకొనే అవకాశం ఉంది. స్టోరేజ్ పరంగా 64GB, 128GB వేరియంట్లు అందుబాటులో ఉండగా.. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 2TB వరకు పెంచుకోవచ్చు.
బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్:
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20లో 5200mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉండటంతో ఇతర డివైస్‌లను ఛార్జ్ చేసుకునే అవకాశం కల్పించింది.
కెమెరా ఫీచర్లు:
ఫోటోగ్రఫీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8MP ప్రధాన కెమెరాను అమర్చారు. దీనికి ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు సహాయక సెన్సార్‌ను కూడా జోడించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరా అందుబాటులో ఉంది. సూపర్ నైట్ మోడ్, డ్యూయల్ వీడియో, వ్లాగ్ మోడ్ వంటి సాఫ్ట్వేర్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఇతర ఫీచర్స్:
ఈ ఫోన్ 4G నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తుంది. ప్రత్యేకంగా ఇన్ఫినిక్స్ పరిచయం చేసిన “అల్ట్రా లింక్” ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ లేకున్నా అనుకూల ఇన్ఫినిక్స్ ఫోన్ల మధ్య ఒక కిలోమీటర్ వరకు వాకీ-టాకీ తరహా కమ్యూనికేషన్ చేయవచ్చు. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, DTS ఆడియో, FM రేడియో, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, IP64 డస్ట్ మరియు వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధర:
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4GB + 64GB వేరియంట్ ధర రూ.12,499 కాగా, 4GB + 128GB వేరియంట్ ధర రూ.13,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా అధికారిక ఆన్లైన్ స్టోర్ ద్వారా విక్రయానికి అందుబాటులోకి రానుంది. సన్‌లైక్ ఆరెంజ్, క్లౌడ్‌లైన్ బ్లూ, షాడో బ్లాక్, పోలారిస్ టైటానియం రంగుల్లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్లో భాగంగా అన్ని ప్రధాన బ్యాంక్ కార్డులపై రూ.500 ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో బేస్ వేరియంట్‌ను రూ.11,999 ప్రారంభ ధరకు సొంతం చేసుకునే అవకాశం వినియోగదారులకు లభించనుంది.
Your Smart Move- Launching 8th June ⚡️🫡#yoursmartmove #infinixsmart20 pic.twitter.com/gt10NtLknr
— Infinix India (@InfinixIndia) June 7, 2026
తాజావార్తలు
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్‌లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్‌తో సినిమా రెండేళ్లు పోస్ట్‌పోన్
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!