Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
- భారత్‌లో Lenovo IdeaPad Slim 3 Gen 11 విడుదల
- AI ఫీచర్లతో అదిరిపోయే ల్యాప్‌టాప్
- రూ.1.09 లక్షల ప్రారంభ ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ టెక్నాలజీ సంస్థ లెనోవా (Lenovo) భారత మార్కెట్లో తన కొత్త IdeaPad Slim 3 Gen 11 ల్యాప్‌టాప్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఆధునిక ఫీచర్లు, AI సామర్థ్యాలు, శక్తివంతమైన ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్ 14 అంగుళాలు, 15 అంగుళాల డిస్ప్లే ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఇంటెల్ తాజా Core Ultra Series 3 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్, రోజువారీ పనులతో పాటు మల్టీటాస్కింగ్, వీడియో కాలింగ్, ప్రొడక్టివిటీ అవసరాలకు అనుకూలంగా రూపొందించారు. అంతేకాకుండా, ఇందులో పలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Lenovo IdeaPad Slim 3 Gen 11 ధర
భారత మార్కెట్లో Lenovo IdeaPad Slim 3 Gen 11 ప్రారంభ ధర రూ.1,09,900గా నిర్ణయించారు. వినియోగదారులు లెనోవా అధికారిక వెబ్సైట్ ద్వారా తమ అవసరాలకు అనుగుణంగా ఈ ల్యాప్‌టాప్‌ను కస్టమైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అదనంగా, కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌పై రూ.10,000 వరకు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే 12 నెలల నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ Luna Grey కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంటుంది.
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
డిస్ప్లే ఫీచర్లు
Lenovo IdeaPad Slim 3 Gen 11 రెండు డిస్ప్లే వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 14 అంగుళాల డిస్ప్లే, 15 అంగుళాల డిస్ప్లే. ఈ రెండు డిస్ప్లేలు 16:10 యాస్పెక్ట్ రేషియోతో పాటు 400 నిట్స్ మ్యాక్సిమస్ బ్రైట్ నెస్ కి సపోర్ట్ చేస్తాయి. సన్నని బెజెల్స్ కారణంగా స్క్రీన్-టు-బాడీ రేషియో మరింత మెరుగుపడి, 90 శాతం యాక్టివ్ ఏరియా రేషియోను అందిస్తుందని లెనోవా తెలిపింది. అలాగే కళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు TÜV Low Blue Light Certification కూడా ఈ డిస్ప్లేలకు లభించింది.
శక్తివంతమైన ప్రాసెసర్, AI ఫీచర్లు
ఈ కొత్త ల్యాప్‌టాప్ Intel Core Ultra Series 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో Copilot+ సామర్థ్యాలు ఉండటంతో AI ఆధారిత పనులను మరింత వేగంగా నిర్వహించవచ్చు. అదనంగా, ఇందులో Intel Arc Graphics అందుబాటులో ఉన్నాయి. దీంతో సాధారణ గ్రాఫిక్స్ పనులు, కంటెంట్ క్రియేషన్, మల్టీమీడియా వినియోగం మరింత సులభంగా ఉంటుంది.
ర్యామ్, స్టోరేజ్
Lenovo IdeaPad Slim 3 Gen 11లో గరిష్టంగా 16GB RAM, 512GB వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంటాయి. దీంతో మల్టీటాస్కింగ్ పనులను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించవచ్చు.
వీడియో కాలింగ్, కనెక్టివిటీ
ఈ ల్యాప్‌టాప్‌లో వీడియో కాల్స్ కోసం FHD IR కెమెరాను అందించారు. ఇది మెరుగైన వీడియో నాణ్యతతో పాటు భద్రతా ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది. ఈ ల్యాప్‌టాప్ Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
కనెక్టివిటీ పరంగా ఇందులో:
బ్లూటూత్
వై-ఫై
HDMI పోర్ట్
USB Type-A పోర్ట్
USB Type-C పోర్ట్
3.5mm ఆడియో జాక్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్
Lenovo IdeaPad Slim 3 Gen 11లో 60Wh బ్యాటరీను అందించారు. ఇది కంపెనీ ప్రత్యేకమైన Rapid Charge Boost ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. లెనోవా ప్రకారం, కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను రెండు గంటల వరకు ఉపయోగించవచ్చు. AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్, ప్రీమియం డిస్ప్లే, వేగవంతమైన ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లతో వచ్చిన Lenovo IdeaPad Slim 3 Gen 11 విద్యార్థులు, ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లు, రోజువారీ వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ గా నిలవనుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!