AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
- ఏపీ మీదుగా చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
- శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు విస్తరించిన రుతుపవనాలు
- నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Southwest Monsoon Active Over AP: ఆంధ్రప్రదేశ్ మీదుగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాలు శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు విస్తరించాయని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో నేడు (జూన్ 12) భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోస్తాంధ్ర వ్యాప్తంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా రహదారులపై నీరు నిలిచిపోవడం, చెట్లు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
Also Read
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు!
సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు తక్షణమే తీరానికి చేరుకోవాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!