వడోదరలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలోనూ భారత బౌలర్ దీప్తి శర్మ ఆరు వికెట్లతో చెలరేగింది. తన కోటా 10 ఓవర్లలో 31 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ పడగొట్టింది. దీప్తితో పాటు రేణుకా ఠాకూర్ (4/29) కూడా చెలరేగడంతో విండీస్ కుదేలైంది. భారత బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ 38.5 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో చినెల్లె హెన్రీ (61) హాఫ్ సెంచరీ చేయగా.. క్యాంప్‌బెల్లె (46), అలియా అలెన్ (21) రాణించారు. క్వియానా…