Indrakaran Reddy : ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి సోయగాలకు నెలవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మల్ పర్యాటకాభివృద్ధిలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అ్లలోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి సోయగాలకు నెలవు అని, దీంతో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి సందర్శకుల రాకపోకలు ఎక్కువయ్యాయని మంత్రి తెలిపారు. పర్యాటక ప్రాంతాలు, ఆధ్మాత్మిక కేంద్రాలు, చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వం అనేక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. నిర్మల్ కొత్త జిల్లాగా ఆవిర్భవించాక మౌలిక వసతులు పెరిగాయని, అలాగే దక్షిణ భారతదేశలోనే ఏకైక బాసర సరస్వతీ అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు వస్తుండటం, కవ్వాల్ అభయారణ్యం, కడెం ప్రాజెక్ట్, కుంటాల, పొచ్చెర జలపాతాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు నిర్మల్ పట్టణం కేంద్రబిందువుగా మారిందన్నారు.
Also Read : Today (27-12-22) Stock Market Roundup: వరుసగా రెండో రోజూ కొనసాగిన శాంతాక్లాజ్ ర్యాలీ
ఆహ్లాదం, ఆధ్యాత్మికంగా నిర్మల్ కొత్తరూపు సంతరించుకుందని, అయితే పర్యాటకుల తాకిడి పెరగడం, జిల్లా కేంద్రంగా విస్తరించిన విశ్రాంతి భవనాల కొరత తీవ్రంగా ఉందని, తగిన మౌలిక వసతులతో జిల్లా కేంద్రంలో ఆధునాతన హరిత హోటల్ నిర్మాణంతో పర్యాటకులు, భక్తులకు ఆ కొరత తీరనుందని చెప్పారు. రూ. 12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హరిత హోటల్ నిర్మాణానికి ఆర్ & బీ శాఖ తమ స్థలాన్ని కేటాయిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆధునిక వసతులతో హోటల్ నిర్మాణం పూర్తయితే దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎంతగానే ఉపయోగపడుతుందని వెల్లడించారు. త్వరలోనే టెండర్ లు పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
Also Read
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!