Indigo: బీజేపీ నేత ఫిర్యాదుతో దిగి వచ్చిన ఇండిగో.. ఇకపై స్నాక్స్‌తో పాటు అది ఉచితం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indigo Decided to Provide Free Cool Drink With Snacks: విమాన ప్రయాణం అంటే ఇప్పటికి కూడా చాలా ఖరీదైనదే. కేవలం ఫ్లైట్ టికెట్ మాత్రమే కాదు.. అందులో స్నాక్స్ కొనాలంటే కూడా తడిసి మోపిడైపోతుంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ, బీజేపీ నేత చేసిన ఫిర్యాదుతో ఇండిగో విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. స్నాక్స్ తో పాటు కోక్ ను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.
Also Read: ED Raids: అహ్మదాబాద్‌లో ఈడీ దాడులు.. రూ.1.36 కోట్ల నగదు, 1.2 కేజీల బంగారం, లగ్జరీ కార్లు స్వాధీనం
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
వివరాల ప్రకారం బీజేపీ నేత, మాజీ ఎంపీ స్వపన్ దాస్‌గుప్తా ఇండిగో విమానంలో కూల్ డ్రింక్స్ అమ్మకంపై గతంలో కేంద్రవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యసింధియాకు ఫిర్యాదు చేశారు. విమానంలో ప్రయాణించే సమయంలో కూల్ డ్రింక్స్ కొనలేమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా అదనపు వసూళ్లతో ప్రయాణీకుల నుంచి డబ్బు గుంజడం సరికాదని అభిప్రాయపడ్డారు. విమానాల్లో కూల్ డ్రింక్స్ ను క్యాన్లలో అందించి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారని దీని వల్ల ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో ఇండిగో మెనూలో జీడిపప్పు ధర రూ.200, కోక్ ధర రూ. 100 గా ఉండేది. అంటే మనం స్నాక్స్ తీసుకుంటే కూల్ డ్రింక్ కోసం అదనంగా రూ.100 చెల్లించాల్సి వచ్చేది. అంటే సాధారణంగా స్నాక్స్ కోసమే ఓ ప్రయాణీకుడు రూ. 300 వెచ్చించాల్సి వచ్చేది. దీని గురించే బీజేపీ నేత స్వపన్ దాస్ గుప్తా ఫిర్యాదు చేశారు.శీతల పానీయాల పేరిట దోచుకుంటున్నారని, బలవంతంగా ప్రయాణీకులతో స్నాక్స్ కొనిపిస్తున్నారని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరారు. అదనపు దోపిడీని అరికట్టి ప్రయాణికులకు ఊరట కల్పించాలని సోషల్ మీడిడా వేదికగా విన్నవించారు. ఈ నేపథ్యంలోనే ఇండిగో సంస్థ దీనిపై స్పందించింది. ప్రస్తుతం ఉన్న తన మెనూను సవరించింది. దీంతో స్పందించిన ఇండిగో కూల్ డ్రింక్ ను క్యాన్స్ లో అందించబోమని స్నాక్స్‌తో పాటు కాంప్లిమెంటరీగా గ్లాసు జ్యూస్‌ను, కోక్‌ను ఉచితంగా అందిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ఇది ప్రయాణీకులకు కొంత ఊరటనిచ్చే విషయం అని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!