Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. ఫైనల్స్‌కు చేరిన హాకీ జట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Games 2023: 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు.. సెమీ ఫైనల్ లోనే ఓటిమిని చవిచూడల్సి వచ్చింది. కానీ ఈసారి ఆసియా గేమ్స్ లో భారత పురుషుల జట్టు ఫైనల్ కు చేరుకుంది. సెమీఫైనల్లో దక్షిణ కొరియాను 5-3తో ఓడించింది. దీంతో.. భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో ఐదో నిమిషంలో భారత జట్టు తొలి గోల్ చేసింది. అనంతరం 11వ నిమిషంలో మరో గోల్ చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత జట్టు 2-0తో ముందుకు దూసుకెళ్లింది.
Read Also: Union Cabinet: కీలక నిర్ణయాలు.. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ, పసుపు బోర్డుకు ఆమోదం
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఈ మ్యాచ్ 15వ నిమిషంలో భారత్ మూడో గోల్ చేయగా.. 17వ నిమిషంలో దక్షిణ కొరియా తొలి గోల్ చేసింది. ఆ తర్వాత 20వ నిమిషంలో దక్షిణ కొరియా రెండో గోల్ చేసింది. అయితే ఈ సమయంలో టీమిండియా 3-2తో ముందంజలో ఉంది. ఆ తర్వాత భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడి మంచి ప్రదర్శనను చూపించారు.
Read Also: David Warner: డేవిడ్ భాయ్ బౌలింగ్ చూశారా.. మాములుగా లేదు..! పరుగుల సమర్పయామి
24వ నిమిషంలో భారత్‌కు నాలుగో గోల్ వచ్చింది. దీంతో భారత జట్టు 4-2తో ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత దక్షిణ కొరియా మరోసారి ఎదురుదాడికి దిగింది. 42వ నిమిషంలో దక్షిణ కొరియా గోల్ చేసింది. దీంతో స్కోరు 4-3గా మారింది. భారత జట్టు ఆధిక్యం చెక్కుచెదరలేదు. అంతేకాకుండా.. 54వ నిమిషంలో భారత్ ఐదో గోల్ చేసింది. దీంతో మ్యాచ్‌లో భారత జట్టు 5-3తో ముందంజ వేసింది. చివర్లో టీమ్ ఇండియా దక్షిణ కొరియా ఆటగాళ్లకు గోల్స్ చేసే అవకాశం ఇవ్వకుండా.. మంచి ప్రదర్శన చూపించారు. దీంతో భారత జట్టు 5-3తో దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!