కోలీవుడ్ లో మరో సంచలన కాంబో రెడీ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీపడిన సూపర్ స్టార్ రజనీ, కమల్ హాసన్ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరినీ ఒకే సినిమాలో చూపించబోతున్నాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. కమల్ కు విక్రమ్ రూపంలో భారీ హిట్ ఇచ్చిన లోకేష్ రీసెంట్ గా రజనితో కూలీతో డైరెక్ట్ చేసాడు.
Also Read : Jeethu Joseph : కిష్కింద కాండం పెయిర్ తో దృశ్యం దర్శకుడి మరోథ్రిల్లర్..
ఇప్పుడు ఈ ఇద్దరిని కలిపి ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడు లోకి. ఇటీవల కొద్దీ రోజులుగా తమిళ మీడియాలో గాసిప్ లా వినిపిస్తున్న ఈ న్యూస్ ఇప్పుడు చేసాడు కమల్ హాసన్. తాజాగా దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ ” నేను రజిని కలిసిచాలా ఏళ్ల క్రితం సినిమా చేయాలనుకున్నాం కానీ కుదరలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు మేము కలిసి సినిమా చేయబోతున్నాం. త్వరలోనే మా ఇద్దరి కాంబోలో సినిమా ఉంటుంది’ అని అన్నారు. దాంతో కొద్దీ రోజులుగా గాసిప్ గా ఉన్న ఈ న్యూస్ కమల్ కామెంట్స్ తో అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. ఇటీవల ఇద్దరినీ కలిసి కథ కూడా వినిపించాడటలోకేష్ . 1979 లో వచ్చిన అల్లావుద్దీనుమ్ అల్భూత విలక్కం తర్వాత అంటే 46 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మిస్తారట.