రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. భారతీయ రైల్వేలోని వివిధ జోన్‌లలో 6,180 టెక్నీషియన్ ఖాళీల భర్తీ కోసం రెడీ అయ్యింది. జూన్ 16 నాటి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో షార్ట్ నోటిఫికేషన్ ను ప్రచురించింది. జూన్ 27 నాటికి వివరణాత్మక ప్రకటన (CEN 02/2025) విడుదలవుతుందని భావిస్తున్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 28న ప్రారంభమై జూలై 28న రాత్రి 11.59 గంటలకు ముగుస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు RRB వెబ్‌సైట్ rrbcdg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read:Gold Rates: కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
మొత్తం ఖాళీలలో 180 టెక్నీషియన్ గ్రేడ్1 సిగ్నల్ పోస్టులకు, మిగిలిన 6,000 టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా ఎంపిక చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్‌లో బీఎస్సీ డిగ్రీ లేదా సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్‌లో డిప్లొమా/డిగ్రీ కలిగి ఉండాలి.
Also Read:Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం. అంతర్జాతీయ సేవలు కుదింపు
10వ తరగతి (SSLC/మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. ఫౌండ్రీమ్యాన్, మోల్డర్, ప్యాటర్న్ మేకర్ లేదా ఫోర్జర్, హీట్ ట్రీటర్ వంటి నిర్దిష్ట ట్రేడ్‌లలో ITI లేదా అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టుల కోసం 18 నుంచి 33 సంవత్సరాలు, గ్రేడ్ 3 కోసం 18 నుంచి 30 సంవత్సరాలు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు వయో సడలింపులు వర్తిస్తాయి.
Also Read:Yogandhra 2025: విశాఖ నగరానికి వీవీఐపీల తాకిడి.. ఫుల్ లిస్ట్ ఇదే!
ఎస్సీ/ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతి రూ. 250 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. (CBTకి హాజరైన తర్వాత పూర్తిగా వాపసు ఇవ్వబడుతుంది). అన్ని ఇతర వర్గాలు రూ. 500 చెల్లించాలి. (CBTకి హాజరైన తర్వాత రూ. 400 వాపసు ఇవ్వబడుతుంది). టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 29,200 జీతం, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 19,900 వేతనం అందిస్తారు.