బంగారం ధరలు భారీగా పడిపోయాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 600 తగ్గింది. తగ్గిన ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,048, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,210 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 తగ్గింది. దీంతో రూ. 92,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 600 తగ్గింది. దీంతో రూ. 1,00,480 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
Also Read:Nikki Tamboli : నిక్కీ తంబోలి.. హాట్ ఫొటోస్ తో రచ్చ రంబోలా
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 తగ్గింది. దీంతో రూ. 92,250 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 580 తగ్గింది. దీంతో రూ. 1,00,630 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు కిలో సిల్వర్ పై రూ. 2000 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,20,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,10,000 వద్ద ట్రేడ్ అవుతోంది.