Sachin Tendulkar and Vinod Kambli: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ నడవలేని స్థితిలో ఉన్నారు. పని మీద బయటికొచ్చిన ఆయన ఓ షాప్ ముందు ఉన్న బైక్‌ని పట్టుకుని నిల్చున్నారు. షాప్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించగా.. నడవలేక చాలా ఇబ్బందిపడ్డారు. ఇది చూసిన కొందరు స్థానికులు కాంబ్లీ చేతులు పట్టుకుని షాప్‌లో కూర్చోబెట్టారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గత కొన్నేళ్లుగా వినోద్ కాంబ్లీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. బీసీసీఐ ఇచ్చే పింఛనుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. తాజాగా కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించి నడవలేని స్థితిలో ఉండడంతో.. భారత అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన మిత్రుడు కాంబ్లీని ఆదుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘సచిన్ సర్.. జర మీ దోస్తును ఆదుకోరాదు’, ‘మీ స్నేహితుడు కాంబ్లీ అనారోగ్యంతో ఉన్నాడు. అతనికి సహాయం చేయండి సచిన్’, ‘అతి త్వరలో మీరు కాంబ్లీ కోసం కూడా ట్వీట్ చేస్తారు’ అని ఫాన్స్ ట్వీట్స్ పెడుతున్నారు.
Also Read: Best 5G Smartphones 2024: మీ బడ్జెట్ 30 వేలా.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ మంచి స్నేహితులు. 1988లో పాఠశాల స్థాయి క్రికెట్‌లో ఇద్దరు కలిసి ఆడారు. హారిస్ షీల్డ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈ జోడి 664 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఇందులో కాంబ్లి 349, సచిన్ 326 పరుగులు చేశారు. 1990ల్లో అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కాంబ్లీ రాణించారు. అయితే ఫామ్ కోల్పోయి కెరీర్‌ను ముగించారు. మరోవైపు సచిన్ మాత్రం ఎవరికీ సాధ్యం కానీ రికార్డులను సృష్టించి.. ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు.
Please check on Kambli.
Very soon you will be tweeting for him as well.— 🇮🇳🇮🇳🇮🇳 (@ashwinikc) August 5, 2024
Your friend Vinod Kambli is very ill. Forgot all the issues and help him. No option only sending obituaries
— Discount Adda (@Opinions1789) August 5, 2024