Attack On Indian Consulate: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ఉన్న భారత కాన్సులేట్‌పై దాడి ఘటన వెలుగు చూసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున 1.30 నుండి 2.30 గంటల వరకు జరిగింది. కొందరు ఖలిస్తాన్ మద్దతుదారులు రాయబార కార్యాలయంపై దాడి చేసి నిప్పంటించారని ఆరోపించారు. భారత రాయబార కార్యాలయాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు లక్ష్యంగా చేసుకోవడం గత ఐదు నెలల్లో ఇది రెండో ఘటన.
ఈ సంఘటనను యునైటెడ్ స్టేట్స్ తీవ్రంగా ఖండించింది. ఎంబసీలో మంటలు భారీ రూపం దాల్చకముందే శాన్ ఫ్రాన్సిస్కో అగ్నిమాపక విభాగం మంటలను అదుపు చేయగలిగింది. అగ్నిప్రమాదం కారణంగా రాయబార కార్యాలయానికి పెద్దగా నష్టం జరగలేదు ఏ ఉద్యోగి కూడా గాయపడలేదు. ఈ ఘటనకు సంబంధించి ఖలిస్తానీ మద్దతుదారులు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఖలిస్తానీ మద్దతుదారులు పంచుకున్న వీడియోలో కెనడాలో గ్రూప్‌కు చెందిన హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చి చంపినందుకు నిరసనగా వారు రాయబార కార్యాలయంపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. కెనడాలోని సర్రేలో ఇద్దరు గుర్తు తెలియని ముష్కరులు నిజ్జర్‌ను కాల్చి చంపారు. నిజ్జర్ సిక్కుల ఫర్ జస్టిస్(SFJ)తో కూడా అనుబంధం కలిగి ఉన్నాడు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై జరిగిన విధ్వంసం, దహన ప్రయత్నాలను అమెరికా తీవ్రంగా ఖండిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ట్వీట్ చేశారు. ఇది అమెరికాలోని విదేశీ దౌత్యవేత్తలపై నేరంగా అభివర్ణించారు.
Read Also:Parents Rent: అద్దెకు అమ్మానాన్నలు.. భలే బిజినెస్ బాసూ
#BREAKING: Khalistani radicals set afire at the Indian Consulate in #SanFrancisco, United States on July 2nd. Fire was immediately brought under control. Local law enforcement and FBI are investigating the matter. No arrests made yet. Khalistani radicals have released a video. pic.twitter.com/lQ3esZ1Let
— Aditya Raj Kaul (@AdityaRajKaul) July 3, 2023
రాయబార కార్యాలయంపై మార్చిలో దాడి
ఖలిస్తానీ మద్దతుదారులు శాన్ ఫ్రాన్సిస్కోలోని మార్చిలో భారత రాయబార కార్యాలయంపై దాడి చేసి భవనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనను భారత, అమెరికా ప్రభుత్వాలు ఖండించాయి. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
The U.S. strongly condemns the reported vandalism and attempted arson against the Indian Consulate in San Francisco on Saturday. Vandalism or violence against diplomatic facilities or foreign diplomats in the U.S. is a criminal offense.
— Matthew Miller (@StateDeptSpox) July 3, 2023
బారికేడ్లను బద్దలుకొట్టి లోపలికి ప్రవేశం
ఖలిస్తాన్ అనుకూల నిరసనకారులు నినాదాలు చేస్తూ దాడి చేయడానికి రాయబార కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి, అక్కడ రెండు ఖలిస్థానీ జెండాలను ఉంచారు. ఎంబసీ సిబ్బంది వెంటనే ఈ జెండాలను తొలగించారు. గతంలో లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల బృందం దాడి చేసినప్పుడు లండన్‌లో కూడా ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. రాయబార కార్యాలయంపై ఉన్న త్రివర్ణ పతాకాన్ని కూడా తారుమారు చేశారు.
Read Also:Mangalavaaram Teaser: ఒరేయ్ పులి.. నువ్ కాసేపు పూ మూసుకుని గమ్మునుండరా! ఆసక్తిగా మంగళవారం టీజర్