Rohit Sharma: రోహిత్ శర్మ జైత్రయాత్ర.. 17 సిరీస్‌ల్లో వరుస విజయాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India registers 17th consecutive Test series win on home soil: ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ జైత్రయాత్ర కొనసాగుతుంది. టెస్ట్ ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రోహిత్‌కు ఇప్పటివరకు ఓటమనేది లేదు. ఇప్పటివరకు హిట్‌మ్యాన్ సారథ్యంలో భారత్ 5 టెస్ట్ సిరీస్‌లు ఆడగా.. ఒక్కటి కూడా కోల్పోలేదు. ఐదింటిలో 4 టెస్ట్ సిరీస్‌లు గెలవగా.. ఒకటి మాత్రం డ్రాగా ముగిసింది. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ సారథ్యంలో కూడా భారత జట్టు అద్భుత టెస్ట్ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే.
కెప్టెన్‌గా రోహిత్ శర్మ ప్రస్తానం 2021-22 శ్రీలంక సిరీస్‌తో మొదలైంది. స్వదేశంలో శ్రీలంకపై 2-0 తేడాతో భారత్ గెలిచింది. అనంతరం స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో సిరీస్ నెగ్గిన భారత్.. వెస్టిండీస్ గడ్డపై 1-0 తేడాతో గెలిచింది. ఆపై దక్షిణాఫ్రికా గడ్డపై 1-1తో డ్రాగా ముగించింది. తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌పై 3-1తో సిరీస్ నెగ్గింది. ఈ సిరీస్‌లో మరో టెస్ట్ మిగిలి ఉన్న విషయం తెలిసిందే. మొత్తానికి రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా అద్భుత విజయాలు అందుకుంది. ఇక న్యూజీలాండ్, ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. రోహిత్ మరో మెట్టు ఎక్కుతాడు.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
Also Read: IVPL 2024: క్రిస్ గేల్ 10 సిక్సర్లు బాదినా.. తెలంగాణకు తప్పని ఓటమి!
మరోవైపు స్వదేశంలో భారత్ విజయపరంపర 11 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో స్వదేశంలో రికార్డు స్థాయిలో 17 సిరీస్‌ల్లో వరుసగా విజయాలు సాధించింది. 2013 ఫిబ్రవరిలో మొదలైన జైత్రయాత్ర.. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ వరకు కొనసాగింది. ఏ జట్టు కూడా స్వదేశంలో వరుసగా ఇన్ని సిరీస్‌ల్లో వరుస విజయాలు సాధించలేదు. ఆస్ట్రేలియా రెండుసార్లు (1994-2001, 2004-2008) స్వదేశంలో వరుసగా 10 సిరీస్‌ల్లో విజయాలు అందుకుంది. వెస్టిండీస్ (1976-1986), న్యూజిలాండ్ (2017-2021) జట్లు సొంత గడ్డపై 8 సిరీస్‌ల్లో వరుసగా విజయాలు సాధించాయి.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!