Sunil Gavaskar Lucky Jacket Sentiment Works Again: అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్‌లో ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదవ టెస్ట్‌లో భారత్ చిరస్మరణీయ విజయం సాధించింది. 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది సంచలన విజయం సాధించింది. ఐదవరోజు ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా. భారత్ గెలుపుకు 4 వికెట్స్ అసవరం అయ్యాయి. సిరాజ్ మూడు వికెట్లతో చెలరేగడంతో ఆతిథ్య జట్టు 28 రన్స్‌కు ఆలౌటైంది. ఇంగ్లండ్ చివరి వికెట్ పడగానే ప్లేయర్స్, అభిమానులతో పాటు భారత కామెంటేటర్లు కూడా గంతులేశారు. ఇందులో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఉన్నారు. గవాస్కర్ ఈ ఆనందానికి ఓ కారణం ఉంది.
2021లో గబ్బాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ఓ వైట్ జాకెట్ వేసుకున్నారు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. అంతేకాదు 2-1 తేడాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఆ కోటును సన్నీ తన లక్కీ జాకెట్‌గా భావిస్తున్నారు. వైట్ జాకెట్‌ను చాలా భద్రంగా దాచుకున్నారు. ఓవల్‌లో ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో భారత్ గెలవాలని ఆ లక్కీ జాకెట్‌ను గవాస్కర్ ధరించారు. మ్యాచ్ 4, 5 రోజు ఆట సందర్భంగా సన్నీ లక్కీ జాకెట్ ధరించారు. భారత్ చిరస్మరణీయ విజయం సాధించింది. చివరి వికెట్ పడగానే కామెంటరీ బాక్స్‌లో ఉన్న సన్నీ సీట్లో నుంచి లేచి చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: Oval Test: ఓవల్ టెస్ట్ విజయం.. భారత్ సరికొత్త రికార్డ్!
ఓవల్‌లో మ్యాచ్ రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. మూడో రోజు ఆట ముగిసిన తర్వాత సునీల్ గవాస్కర్ టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో మాట్లాడారు. ఓవల్‌లో భారత్ గెలవాలని, సిరీస్‌ను 2-2తో సమం చేయాలని ఆకాంక్షిస్తూ.. తన లక్కీ జాకెట్‌ను వేసుకొస్తానని చెప్పారు. గతంలో ఆస్ట్రేలియాలో గబ్బా టెస్టులో ఓ జాకెట్‌ను ధరించాను అని, విజయాల కోసమే తన వద్ద ఉదని తెలిపారు. చెప్పినట్టే 4, 5 రోజుల్లో జాకెట్‌ను వేసుకొని రాగా.. భారత్ గెలుపొందింది. గవాస్కర్ సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అయిందిగా అంటూ ఫాన్స్ కెమెంట్స్ చేస్తున్నారు.
A win carved in 𝘨𝘳𝘪𝘵. A moment owned by 𝐈𝐍𝐃𝐈𝐀 🇮🇳 ✨
Scenes from the commentary box as India do the improbable 🎙️#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/nYwGOn5jDx
— Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2025