India vs South Africa 3rd T20I: ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్, దక్షిణాఫ్రికా మూడో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణయం పూర్తిగా ఫలించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు భారత బౌలర్ల దెబ్బకు ఉక్కిరిబిక్కిరై నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌటయ్యారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే సఫారీ జట్టుకు భారీ షాక్ తగిలింది. క్వింటన్ డికాక్ (1), రీజా హెండ్రిక్స్ (0)లు ఖాతా…