న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నేడు దాయాదుల సమరం మ్యాచ్ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసమని కొత్తగా నిర్మించిన నసావు స్టేడియంలో నేడు భారత్, పాకిస్థాన్ మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా సూపర్ 8 కి దూసుకెళ్లే అవకాశం లేకపోలేదు. 34,000 ప్రేక్షకుల సామర్థ్యం కల్గి ఉన నసావు స్టేడియం దాయాదుల మ్యాచ్ కు స్టేడియం కిక్కిరిసిపోయే అవకాశముంది. టిక్కెట్ల భారీ ధరను ఏమాత్రం లెక్క చేయకుండా వేల కి.మీ. దూరం నుండి ప్రయాణించి తమ అభిమాన క్రికెటర్ల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు వస్తున్నారు.
Group-1 Prelims: నేడే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. కేంద్రాల వద్ద 144 సెక్షన్..
ఇక ఐర్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో ఘన విజయం సాధించిన రోహిత్ సేన అదే దూకుడుతో మరోసారి పాకిస్థాన్ పనిపట్టాలని భాసిస్తుంది. ఇక మరోవైపు నిలకడలేమికి చిరునామాగా మారిన పాక్ టీమ్‌ఇండియాపై ఎలాగైనా విజయం సాధించాలని సిద్ధమైంది. ఇక ఈ గ్రౌండ్ పిచ్ ను ఆస్ట్రేలియాలో తయారు చేసి న్యూయార్క్ లో ఇన్స్టాల్ చేశారు. ఇలాంటి పిచ్ లను సిద్ధం చేయడానికి రెండేళ్లు పడుతుంది. కానీ., 3 నెలల్లో రెడీ చేసారు. ఈ కారణంగానే పిచ్ ముప్పుతిప్పలు పెడుతోంది. నేడు జరగబోయే మ్యాచ్ లో రెండు టీమ్స్ లో ఆటగాళ్లను ఈవిధంగా అంచనా వేయవచ్చు.
Rakul preet Singh : ఆ సినిమా నా కెరీర్ లో స్పెషల్ మూవీ..
టీమిండియా: రోహిత్(కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబే, పాండ్యా, జడేజా, అక్షర్, బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్
పాకిస్థాన్: బాబర్(కెప్టెన్), రిజ్వాన్, ఉస్మాన్, జమాన్, ఆజమ్, ఇఫ్తికార్, షాదాబ్ లేదా ఆయూబ్, ఆఫ్రిది, నసీమ్, ఆమిర్, రవూఫ్ లు ఉండవచ్చని అంచనా.