Group-1 Prelims: నేడే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. కేంద్రాల వద్ద 144 సెక్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group-1 Prelims: నేడు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగనుంది. అభ్యర్థులు తమ తమ పరీక్షా కేంద్రాలకు ఉదయం 10:00 గంటలకు ముందే చేరుకోవాలని సూచించారు. 897 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఒక నిమిషం ఆలస్యంగా వచ్చేవారిని అనుమతించమని అధికారులు వెల్లడించారు. కాగా.. పరీక్ష సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శిక్షణ పొందిన బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ల ద్వారా బయోమెట్రిక్ హాజరు నిర్వహించనున్నారు. స్ట్రాంగ్ రూమ్‌లు, పరీక్షా కేంద్రాల వద్ద CC కెమెరాల ఏర్పాటు చేశారు. ప్రతి 20 పరీక్షా కేంద్రాలకు ఒక RC చొప్పున ప్రాంతీయ సమన్వయకర్తల(RC) ను నియమించారు. మొత్తం 897 పరీక్షా కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్లు ఉండనున్నారు. పరీక్ష జరుగుతున్నప్పుడు 3 నుండి 5 కేంద్రాలను తనిఖీ చేసే విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు.
Read also: Astrology: జూన్ 09, ఆదివారం దినఫలాలు
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సహాయం చేయడానికి , మార్గనిర్దేశం చేయడానికి కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా హెల్ప్ డెస్క్ నంబర్‌లు కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రవేశ ద్వారాల వద్ద మాత్రమే కాకుండా ప్రతి పరీక్ష కేంద్రం కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ అధికారులను అభ్యర్థించడం జరిగింది. పరీక్షా కేంద్రాలు ఉన్న రూట్లలో బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచాలని TGSRTC అభ్యర్థించబడింది. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో రెవెన్యూ శాఖ 144 సెక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షా కేంద్రం యొక్క గేట్లు మూసివేసిన తరువాత అభ్యర్థులను పరీక్షా హాలులోకి అనుమతించరు. అభ్యర్థులు A4 పరిమాణ కాగితంపై ముద్రించిన హాల్ టికెట్‌ను లేజర్ ప్రింటర్‌తో తీసుకురావాలని సూచించారు. ప్రాధాన్యంగా కలర్ ప్రింట్ పరీక్షకు హాజరు అయ్యే ముందు ప్రింటెడ్ హాల్ టికెట్ పై మూడు నెలలు కు ముందు తీసుకున్న పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అతికించడం తప్పనిసరి.
Thunderstorm : పిడుగుపాటుతో ఇద్దరు వ్యక్తులు మృతి
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!