Ind vs NZ T20: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన మరో సారి అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా కివీస్‌తో తలపడేందుకు సిద్ధంగా ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి వారికి విశ్రాంతి ఇవ్వడంతో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో యువజట్టు మరోసారి చెలరేగాలని తహతహలాడుతోంది. వైస్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు. ఈ నెల ప్రారంభంలో హార్దిక్ కెప్టెన్సీలో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20లో ఆతిథ్య శ్రీలంకను 2-1తో ఓడించింది. ఇక వన్డే సిరీస్ క్లీన్ ఇచ్చిన ఉత్సాహంతో టీమిండియా ఉంటే.. ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో న్యూజిలాండ్ ఉంది. రెండు జట్ల మధ్య తొలి టీ20 నేడే. హార్దిక్ నేతృత్వంలోని టీమ్‌ఇండియా జోరు కొనసాగిస్తుందా అన్నది చూడాల్సిందే.
స్వల్ప మార్పుల మినహా అదే జట్టు ఈసారి కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒక ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఖాయం కాగా… రెండో ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ ఆడతాడని కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పేశాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో సిరీస్‌కు దూరం కాగా.. పృథ్వీ షా రూపంలో మరో ఓపెనర్ అందుబాటులో ఉన్నాడు. శ్రీలంకతో సిరీస్‌లోనే అరంగేట్రం చేసిన గిల్ టీ20 రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. అయితే వన్డేల్లో అతని తాజా ఫామ్‌ను చూస్తే జట్టులో స్థానం ఇవ్వక తప్పదని కూడా హార్దిక్ వెల్లడించాడు. రాహుల్ త్రిపాఠి తన సత్తాను గత మ్యాచ్‌లో చూపించగా… నాలుగో స్థానంలో ‘ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ రూపంలో సూర్యకుమార్ సిద్ధంగా ఉన్నాడు. ఆల్‌రౌండర్‌గా దీపక్ హుడా బరిలోకి దిగనుండగా, పెళ్లి కారణంగా అక్షర్ పటేల్ ఈ సిరీస్‌కు దూరంగా ఉండటంతో వాషింగ్టన్ సుందర్‌కు చోటు ఖాయమైంది. సీనియర్ పేసర్లు ఎవరూ లేకపోవడంతో మరోసారి ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, శివమ్ మావీలపైనే జట్టు భారం ఉంది. మున్ముందు అగ్రశ్రేణి బౌలర్లు వచ్చినాతమ స్థానం నిలబెట్టుకోవాలంటే ఈ సిరీస్‌లో వీరు సత్తా చాటాల్సి ఉంది.
Elon Musk: మిస్టర్ ట్వీట్‌గా పేరు మార్చుకున్న మస్క్.. ఇదేమైనా కామెడీ ఛానలా?
వన్డే సిరీస్‌లో ఘోరప పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. కానీ విలియమ్సన్, సౌథీ లేకపోవడం ఈ సిరీస్‌లోనూ ఆ జట్టుకు లోటు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. జట్టుకు శాంట్నర్ నాయకత్వం వహించనున్నాడు. ఫిన్ అలెన్, కాన్వే, ఫిలిప్స్, బ్రాస్‌వెల్ వంటి వారితో కివీస్ బ్యాటింగ్ మెరుగ్గానే ఉంది.. ఇండోర్ వన్డేలో కేవలం 100 బంతుల్లో 138 పరుగులు చేసిన కాన్వే జోరు మీద ఉన్నాడు. మూడు వన్డేల్లో 188 పరుగులు చేసిన బ్రాస్‌వెల్ పొట్టి ఫార్మాట్లోనూ అదే జోరును కొనసాగించాలనుకుంటున్నాడు.అయితే ఫెర్గూసన్ మినహా పేస్ బౌలింగ్‌లో అనుభవజ్ఞులు లేకపోవడం న్యూజిలాండ్‌కు సమస్యగా మారింది.