2026 సంవత్సరం భారతదేశానికి కలిసొచ్చినట్లు అనిపిస్తోంది. గతేడాది అంతా గందరగోళంగా ఉంటే.. ఈ ఏడాది మాత్రం ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. మొన్నటికి మొన్న యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది. ఇలా ఒప్పందం జరిగిందో లేదో.. వారం రోజుల వ్యవధిలోనే మరో బిగ్ డీల్ జరిగింది. తాజాగా అగ్ర రాజ్యం అమెరికాతో కీలక ఒప్పందం జరిగింది. భారత్‌పై విధించిన సుంకాన్ని 18 శాతానికి ట్రంప్ తగ్గించారు. ఇది 140 కోట్ల మంది ప్రజలకు శుభవార్తగా ప్రధాని మోడీ పేర్కొన్నారు.
అయితే ఈయూ, అమెరికా ఒప్పందం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు చాలా దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాదాపు 150 బిలియన్ల పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత్ తక్కువ సుంకాలను ఎదుర్కోవడంతో భవిష్యత్ ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. రెండు ఒప్పందాల కారణంగా భారతదేశానికి చాలా ఉపయోగకరం ఉంటుందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా వాణిజ్య యుద్ధ వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణం ఉంటుందని చెబుతున్నారు.
సోమవారం రాత్రి ట్రంప్-మోడీ మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణతో తిరిగి భారత్-అమెరికా మధ్య బంధాలు బలపడ్డాయి. ఇద్దరి నేతల మధ్య జరిగిన ఫోన్ కాల్ తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్‌పై 18 శాతం సుంకం తగ్గించినట్లుగా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. రష్యా చమురు నిలిపివేతకు భారత్ అంగీకరించిందని.. ఇక భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు ఉండబోవని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య మంచి వాణిజ్య ఒప్పందాలు జరిగినట్లుగా పేర్కొన్నారు. మోడీ గొప్ప స్నేహితుడు అంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇండియా టుడే మ్యాగజైన్ కవర్‌పై ఉన్న ట్రంప్-మోడీ ఫొటోను పోస్ట్ చేశారు.
ఇక భారత్‌పై 18 శాతం సుంకాలు తగ్గించినట్లుగా ట్రంప్ ప్రకటన రాగానే ప్రధాని మోడీ ఎక్స్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రియమైన స్నేహితుడు ట్రంప్‌తో ఈరోజు మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలు ఇప్పుడు 18 శాతానికి తగ్గించబడిందని తెలుసుకుని చాలా సంతోషంగా ఉన్నాను. భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజల తరపున అధ్యక్షుడు ట్రంప్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యాలు కలిసి పని చేసినప్పుడు ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. పరస్పర సహకారానికి అపారమైన అవకాశాలను తెరుస్తుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం చాలా కీలకం. శాంతి కోసం ట్రంప్ చేసే ప్రతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుంది. భారత్-యూఎస్ భాగస్వామ్యాన్ని అపూర్వమైన శిఖరాలకు తీసుకెళ్లడానికి ట్రంప్‌తో కలసి పని చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను.’’ అంటూ మోడీ రాసుకొచ్చారు.
Today is a day that will be remembered forever, marked indelibly in our shared history.
European Council President António Costa and European Commission President Ursula von der Leyen and I are delighted to announce the conclusion of the historic India-EU Free Trade Agreement.… pic.twitter.com/yaSlPm2b2L
— Narendra Modi (@narendramodi) January 27, 2026