ప్రజలు గుజరాత్ మోడల్ విడిచి పెట్టి ద్రవిడ మోడల్ అనుసరించాలని మక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్ పిలుపునిచ్చారు. భారత్ ఇకపై ద్రవిడ మోడల్ పాటించాలని పేర్కొన్నారు. డీఎంకే దక్షిణ చెన్నయ్ అభ్యర్థి తమిళచ్చి తంగపాండియన్‌కు సపోర్టుగా మైలాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. దేశ ప్రజలు ‘గుజరాత్ మోడల్ గొప్పదని ఎప్పుడూ చెప్పలేదు.. కానీ ఇప్పుడు భారతదేశం ద్రవిడ నమూనాను అనుసరించాలన్నారు. మన హక్కులను సాధించుకోవాల్సిన టైం వచ్చింది అని చెప్పుకొచ్చారు. మిత్రపక్షాలు ఐక్యంగా పోరాడి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధిస్తాయని కమల్ హాసన్ ధీమా వ్యక్తం చేశారు.
Read Also: K. Laxman: తుక్కుగూడ లో కాంగ్రెస్ భహిరంగ సభ విఫలమైంది..
అయితే, తమిళనాడులో కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే), మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఏం), విదుతలై చిరుతైగల్ చట్చి(వీసీకే), సీపీఐ, సీపీఎంలు భాగస్వామ్య పార్టీలుగా జత కట్టాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 19వ తేదీన తొలి దశ ఎన్నికలు జరగబోతున్నాయి. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలోని 39 స్థానాలకు గాను డీఎంకే 20, కాంగ్రెస్ 8, సీపీఐ 2, సీపీఎం, ఐయూఎంఎల్ ఒక్కో సీటులో విజయం సాధించాయి. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలవగా.. డీఎంకే 20 స్థానాల్లో పోటీ చేయగా అన్ని స్థానాల్లో గెలుపొందింది.