IndvsPak: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారత ఇన్సింగ్స్ తర్వాత ప్రారంభమైన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో ఫీల్డ్ ఎంపైర్లు మ్యాచ్ ను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. అంతకు ముందు పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌తో జరుగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా.. పాక్ బౌలర్ల ధాటికి చతికిలపడింది. షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, నసిమ్ షా నిప్పులు చెరిగే బంతులు విసరడంతో 266 పరుగులకే భారత జట్టు కుప్పకూలిపోయింది.
Read Also: AP CM Jagan London Tour: లండన్ పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
అయితే, తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 48.5 ఓవర్లలో 266 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 66 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియాని ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా కలిసి ఆదుకున్నారు. చివర్లో జస్ప్రిత్ బుమ్రా కూడా 16 పరుగులు చేయడంతో టీమిండియా… గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 53 బంతుల్లో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేయగా.. వన్డేల్లో ఇషాన్ కిషన్‌కి ఇది ఏడో హాఫ్ సెంచరీ కాగా మిడిల్ ఆర్డర్‌లో మొట్టమొదటిది.. ఇంతకు ముందు ఇషాన్ కిషన్ చేసిన 6 వన్డే హాఫ్ సెంచరీలు కూడా ఓపెనర్‌గా చేసినవే.. 82 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై అత్యధిక స్కోరు బాదిన భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు 2008 ఆసియా కప్‌లో ధోనీ 76 పరుగులు చేయడమే ఆసియా కప్‌లో భారత వికెట్ కీపర్‌కి అత్యధిక స్కోరుగా ఉంది.
Read Also: Samantha: సమంత.. రేణు దేశాయ్ లా మారుతుందా..?
హార్ధిక్ పాండ్యా (90 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ తో 87 పరుగులు ) హాఫ్ సెంచరీ అందుకున్నాడు. వన్డేల్లో హార్ధిక్ పాండ్యాకి ఇది 11వ హాఫ్ సెంచరీ.. కాగా.. హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ కలిసి ఐదో వికెట్‌కి 138 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో ఐదో వికెట్‌కి టీమిండియా తరుపున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇషాన్ కిషన్, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో బాబర్ ఆజమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా.. ఇక, హార్ధిక్ పాండ్యా, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో అఘా సల్మాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. పాండ్యా అవుటైన ఓవర్‌లోనే రవీంద్ర జడేజా కూడా డగౌట్ బాట పట్టాడు. శార్థల్ ఠాకూర్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.
Read Also: India vs Pakistan LIVE Score, Asia Cup 2023: భారత్-పాక్ మ్యాచ్ రద్దు
టీమిండియా 242 పరుగులకే 8 వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ కలిసి 9 వ వికెట్‌కి 19 రన్స్ జోడించారు. 13 బంతుల్లో 4 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్, నసీం షా బౌలింగ్‌లో రిజ్వాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. ఇక, 14 బంతుల్లో 3 ఫోర్లతో 16 రన్స్ చేసిన జస్ప్రిత్ బుమ్రా, నసీం షా బౌలింగ్‌లో సిక్సర్‌కి ట్రై చేసి అవుట్ అయ్యాడు. పాక్ బౌలర్లలో షాహీన్ షా ఆఫ్రిదీకి 4 వికెట్లు దక్కగా.. హారీస్ రౌఫ్ 3 వికెట్లు.. నసీం షాకి 3 వికెట్లు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!