Samantha: సమంత.. రేణు దేశాయ్ లా మారుతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: సమాజంలో స్త్రీ పురుషులు ఒకటే.. ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయి అని పెద్దలు, సమాజ సేవ చేసే సంఘాలు చెప్తూనే వస్తున్నాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఎప్పటికప్పుడు స్త్రీని తప్పు పట్టడం చూస్తూనే ఉన్నాం. తాజాగా సమంత విషయంలో కూడా అలాగే జరుగుతుందని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ లానే సమంత కూడా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. అసలు అంతలా ఏం జరిగింది అంటే.. అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఆ తరువాత విడిపోయారు అన్న విషయం అందరికీ తెల్సిందే. విడిపోవడం అది వాళ్ళ పర్సనల్.. విడిపోయాక సామ్ అభిమానులు ఒకలా.. చైతన్య అభిమానులు మరోలా మాట్లాడుకున్నారు. ఒకరిది తప్పు అంటే ఇంకొకరికి తప్పు అంటూ చెప్పకువచ్చారు. అయితే ఇప్పటివరకు వారిద్దరు విడాకులకు కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు.
ఇక ఇదంతా పక్కన పెడితే విడాకుల తర్వాత చైతన్య, సమంత ఎవరి కెరీర్ వాళ్ళు సెట్ చేసుకునే పనిలో పడ్డారు. ఇక తాజాగా సమంత నటించిన ఖుషీ సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అందుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా చూసిన చాలామంది సమంతను ఏకీపారేస్తున్నారు. విజయ్ తో ఇంటిమేట్ సీన్లు, లిప్ లాక్ లు ఉండడంతో.. భర్తకు విడాకులు ఇచ్చి ఇలాంటి పనులు చేస్తున్నావా..? అంటూ విమర్శిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ ఉండగా నువ్వు ఎలా ఇలాంటి సీన్లు చేస్తావు అంటూ ఆవేశపడుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సమంత బెడ్ సీన్స్ ని అప్లోడ్ చేసి సామ్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే.. విడాకులు తీసుకున్న తర్వాత అక్కినేని కుటుంబం నుంచి సమంతా వేరుపడిపోయింది.. ఒకప్పుడు ఉన్న అక్కినేని కోడలుగా ఆమెని చూడకుండా ఉంటే బెటర్ అని సమంత ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఒక నటిగా ఎలాంటి సీన్స్ చెయ్యాలి..? ఎలాంటి సినిమాలు చేయాలి..? అనేది ఆమె వ్యక్తిగతం. అయినా కూడా చాలామంది అభిమానులు ఇంకా సమంతను అక్కినేని కోడలు గా చూస్తూ ఇలాంటి సీన్స్ చేస్తుందని విమర్శించడం పద్ధతి కాదని వాళ్ళు చెప్పుకొస్తున్నారు.
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
సమంత కన్నా ముందే ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఇలాంటి విమర్శల్ని ఎదుర్కొంటూ వస్తుంది. పవన్, రేణుకు విడాకులు ఇచ్చి ఎన్నో ఏళ్లు అవుతున్నా, ఇప్పటికీ.. ఆమెను వదినా.. వదినా అంటూ పవన్ ఫ్యాన్స్ పిలవడం అందరికీ తెలిసిందే. అంతే కాకుండా ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించినా కూడా.. ఆమె ఎలా చేసుకుంటుంది..? అంటూ పవన్ ఫ్యాన్స్ బెదిరించిన విషయం కూడా తెలిసిందే. అందుకే రెండో పెళ్లి విషయాన్ని ఆమె పక్కన పెట్టేసింది. దీంతో రేణు దేశాయ్ లానే సమంత కూడా మారుతుంది అని చెప్పుకొస్తున్నారు. ఇకముందు కూడా సమంత ఇలాంటి సీన్స్ చేసినా లేక ఇంకెవరినైనా ప్రేమించినా.. వేరొకరిని పెళ్లి చేసుకున్నా అప్పటికి కూడా అక్కినేని ఫ్యాన్స్ ఆమెను విమర్శిస్తూనే ఉంటారని చెప్పుకొస్తున్నారు. అయితే సమంత ఫ్యాన్స్ చైతన్య ఫ్యాన్స్ కి సవాల్ విసురుతున్నారు. చైతన్య లిప్ లాక్ లు, బెడ్ రూమ్ సీన్లు చేయడం లేదా..? అప్పుడు మీరు ఎందుకు మాట్లాడటం లేదు..? ఇప్పుడు ఒక అమ్మాయి చేస్తే ఎందుకు ఇంతలా విమర్శిస్తున్నారు అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. చైతుకి ఒక రూల్..? సామ్ కి ఒక రూల్ పెట్టడం తప్పే కదా అని మరి కొంతమంది చెప్పుకొస్తున్నారు. సమాజంలో సమానమైన హక్కు లేదు అని కొన్ని విషయాల్లో తెలుస్తుంది అని నెటిజెన్లు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!