Who is India’s DGMO: కాల్పుల విరమణలో కీలకంగా వ్యవహరించిన DGMO ఎవరు?

  • భారతదేశం పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ
  • ఇరు దేశాల DGMOల మధ్య చర్చలు సఫలం
  • ఈ చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటన
  • అసలు భారతీయ డీజీఎమ్‌ఓ ఎవరు?
Rajiv Ghai

Rajiv Ghai

భారతదేశం పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించారు. ఇరు దేశాల DGMO (డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్)ల మధ్య చర్చల తర్వాత ఇది సాధ్యమైంది. అసలు భారతీయ డీజీఎమ్‌ఓ ఎవరు? అతని పని ఏంటో తెలుసుకుందాం.. డీజీఎమ్‌ఓ అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్. ఇది సైన్యంలో ఒక ముఖ్యమైన, బాధ్యతాయుతమైన పదవి. ప్రస్తుత భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్. అన్ని సైనిక కార్యకలాపాల బాధ్యత డీజీఎమ్‌ఓదే. ఏదైనా సైనిక చర్య, మార్గనిర్దేశం చేయడం, సూచనలు ఇవ్వడం, ఇతర అన్ని పనులను చేపట్టడం డీజీఎమ్‌ఓపై ఉంటుంది. యుద్ధం, ఘర్షణ సమయంలో సైనిక కార్యకలాపాలకు సంబంధించిన ప్రతి నిర్ణయం ఈయనే తీసుకుంటారు.

READ MORE: Jai shankar: భారత్ ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తుంది.. విదేశాంగ మంత్రి పోస్ట్ వైరల్!

యుద్ధం లేదా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు వ్యూహాలను సిద్ధం చేయడం, శాంతి స్థాపన కోసం కొనసాగుతున్న మిషన్లను రూపొందించడం డీజీఎమ్‌ పని. జనరల్ రాజీవ్ ఘాయ్ సైన్యంలోని మూడు శాఖలు, వివిధ ఏజెన్సీల మధ్య వారధిగా కూడా వ్యవహరిస్తారు. డీజీఎమ్‌ఓ నిఘా సంస్థలతో సమన్వయం చేసుకుంటారు. ఏజెన్సీలు వారికి అవసరమైన పూర్తి సమాచారాన్ని డీజీఎమ్‌ఓకు అందించడం తప్పనిసరి. యుద్ధం ప్రారంభం నుంచి కాల్పుల విరమణ వరకు ప్రతి నిర్ణయంలో డీజీఎమ్‌ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. సరిహద్దు సంబంధిత సమస్యలు, సైనిక కార్యకలాపాలు, ఇతర సమస్యలను ఆయనే నిర్వహిస్తారు.

READ MORE: Sperm Quality: గంజాయి వాడితే వీర్యకణాల నాణ్యతపై ప్రభావం పడుతుందా..?