లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. ఓ క్రికెట్ స్టోరీ చెప్పుకొచ్చారు. మన ఎయిర్ ఫీల్డ్‌లను, లాజిస్టిక్స్‌ను టార్గెట్ చేయడం చాలా కఠినమైన అంశమని తెలిపారు. ఈ అంశాన్ని ఆయన వివరిస్తూ.. క్రికెట్ లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. అయితే, ఈరోజు విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు.. అతను నా ఫెవరేట్ క్రికెటర్ అని పేర్కొన్నారు.
Operation Sindoor: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ గురించి త్రివిధ దళాల సైనికాధికారులు మాట్లాడారు. భారత సైన్యం మే 7-10 మధ్య జరిపిన ప్రతీకార దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి చెందిన 35-40 మంది చనిపోయినట్లు మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ శనివారం చెప్పారు.
భారతదేశం పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించారు. ఇరు దేశాల DGMO (డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్)ల మధ్య చర్చల తర్వాత ఇది సాధ్యమైంది. అసలు భారతీయ డీజీఎమ్ ఎవరు? అతని పని ఏంటో తెలుసుకుందాం.. డీజీఎమ్‌ఓ అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్. ఇది సైన్యంలో ఒక ముఖ్యమైన, బాధ్యతాయుతమైన పదవి. ప్రస్తుత భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్. అన్ని సైనిక కార్యకలాపాల బాధ్యత డీజీఎమ్‌ఓదే. ఏదైనా సైనిక చర్య, మార్గనిర్దేశం చేయడం,…