LCA Tejas Mark 1A Jets: భారతదేశ శక్తిసామర్థ్యాలను ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి పరిచయం చేసింది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు ఇండియా పవర్ ఏంటో చూపించింది ఈ ఆపరేషన్. ఇప్పటికే కంటిమీద కునుకు లేకుండా ఉన్న పాకిస్థాన్‌కు షాకింగ్ న్యూస్ ఏంటంటే.. 97 LCA మార్క్ 1A యుద్ధ విమానాల కొనుగోలుకు భారతదేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఈ విమానాలన్నీ భారతదేశంలోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ప్లాంట్లలో తయారు కానున్నాయి. యుద్ధంలో మిగ్-21 విమానాలనే తట్టుకోలేకపోయిన పాకిస్థాన్ ఈ 97 LCA మార్క్ 1A యుద్ధ విమానాలు బయటికి వస్తే జీహుజూర్ అనకతప్పదని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ఈ కొత్త యుద్ధ విమానాల బలాబలగాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: Dasari Kiran : వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్
LCA మార్క్ 1A: టెక్నాలజీలో రారాజు..
LCA మార్క్ 1A ఇది ఓ సాధారణ విమానం అనుకుంటే పొరపాటే. LCA మార్క్ 1A అత్యాధునిక ఏవియానిక్స్, మల్టీ-ఫంక్షన్ రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌తో రూపుదిద్దుకుంటుంది. ఈ విమానం ప్రధాన బలం ఏమిటంటే శత్రువును కచ్చితత్వంతో ఖతం చేయడం. ఈ విమానంలో అమర్చిన GE F404 ఇంజిన్ ప్రతి మిషన్‌కు వేగంగా, శక్తివంతంగా పని చేస్తుంది. దీని గరిష్ట వేగం సుమారుగా మాక్ 1.6 అంటే గంటకు దాదాపు 1975 కిలోమీటర్లు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విమానం 65% భాగాలు భారతదేశంలోనే తయారు కానున్నాయి. ఇది మేక్ ఇన్ ఇండియా వైపు ఒక పెద్ద అడుగు కానుంది.
ఇప్పటికే HAL బెంగళూరు, నాసిక్, హైదరాబాద్‌లలో ఉత్పత్తి లైన్లను సిద్ధం చేసిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన VEM టెక్నాలజీస్ మొదటి స్వదేశీ ఫ్యూజ్‌లేజ్ అసెంబ్లీని HAL కి అందజేసింది. దీంతో ఇప్పుడు విమానంలోని ప్రతి ప్రధాన భాగం దేశంలోనే తయారు కానుంది. ఇది వైమానిక దళం బలాన్ని పెంచడమే కాకుండా, సాంకేతికతను, దేశీయంగా ఉపాధిని కూడా పెంచనుంది.
భారత్ బలం రెట్టింపు కానుంది..
ప్రస్తుతం మన వైమానిక దళానికి 42 స్క్వాడ్రన్లు కావాల్సి ఉండగా 31 అందుబాటులో ఉన్నాయి. LCA మార్క్ 1A రాకతో వైమానిక దళంలో ఉన్న శూన్యత తొలగిపోనుంది. దీంతో వైమానిక దళం బలం రెట్టింపు అవుతుందని రక్షణ శాఖ అధికారుల అంచనా. ఇది కచ్చితంగా పాక్, మొదలైన ఇండియా వైరి దేశాలకు మింగుడు పడని వార్తే. LCA మార్క్ 1A యుద్ధ వినామాలు వైమానిక దళంలోకి వచ్చిన తర్వాత, క్రమంగా MiG-21 విమానాలను ఉపసంహరించుకోనున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. LCA మార్క్ 1A రాబోయే కాలంలో భారత వైమానిక దళానికి వెన్నెముకగా మారుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
READ MORE: Rare tradition: వింతైన ఆచారం.. మూడు రోజులు పాములు కాటేయవు!