Rare tradition: సాధారణంగా పాములంటే మనుషులకు చచ్చేంత భయం. జీవితంలో ఎప్పుడు కూడా పాము కాటుకు గురికావద్దనే చాలా మంది కోరుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే.. ఓ రాష్ట్రంలో ఉన్న వింతైన ఆచారం కారణంగా అక్కడి ప్రజలు ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. విషయం ఏమిటంటే కంటికి కనిపించిన విషపు పాములను తరమికొట్టకుండా అక్కడి ప్రజలు వాటిని మెడకు చుట్టుకుని తిరుగుతున్నారు. మరో విశేషం ఏమిటంటే అక్కడి వాళ్లు ఇలా పాములను ఏడాది పొడుగునా మెడకు చుట్టుకొని ఉండరు. కేవలం మూడంటే మూడు రోజులు మాత్రమే వాళ్లు ఇలా పాములను మెడకు చుట్టుకొని ఉంటారు. అసలు ఎందుకొని వాళ్లు ఇంతటి సాహసానికి ఒడిగడుతున్నారు. వాస్తవంగా ఈ పాములు అక్కడి జనాలకు హాని చేయవా.. అనే ప్రశ్నలకు ఈ స్టోరీలో సమాధానాలు తెలుసుకుందాం..
READ MORE: Medaram 2026: మేడారం జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ నిధుల మంజూరు
ఇది సినిమా కథ కాదు..
అది జార్ఖండ్ రాజధాని రాంచీలోని బుండు సబ్ డివిజన్ ప్రాంతం. ఇక్కడో విశేషమైన సంప్రదాయం ఉంది. ఇక్కడి భక్తులు కొన్ని వందల సంవత్సరాలుగా పాముల దేవతను కొలుస్తున్నారు. ఆ దేవత పేరు మా మానసా దేవి. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి వచ్చే భక్తులు ఒక ప్రత్యేకమైన సంప్రదాయాన్ని పాటిస్తారు. ఇక్కడ మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలు, సాధారణంగా దేవుళ్లకు జరిగే వాటికి పూర్తి భిన్నంగా, చాలా వింతగా ఉంటాయి. ఇక్కడి సంప్రదాయం ప్రకారం.. గ్రామస్థులు వారి మెడలో విషపు పాములను ధరించి గ్రామంలో తిరుగుతారు. ఆ సమయంలో ఇక్కడ పాముల ఉత్సవం నిర్వహిస్తారు.
పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ… రోహిణి నక్షత్రం సమయంలో వ్యవసాయ పనులు పూర్తయిన తర్వాత మేమంతా అడవికి వెళ్లి విషపు పాములను వెతికి వాటిని పట్టుకుని ఇంటికి వస్తాం. వాటిని దాదాపు ఒక నెల పాటు ఇళ్లలో జాగ్రత్తగా ఉంచుకుంటామన్నారు. ఆ సమయంలో వాటికి నిరంతరం సేవ చేస్తుంటామని తెలిపారు. తరువాత జరిగే మానసదేవి పూజ సమయంలో ఈ పాములను చేతుల్లోకి తీసుకొని తమ శరీరాలపై వదిలి వేస్తామని, దీని ద్వారా తమను కాటు వేయడానికి పాములకు అనుమతించినట్లు చెప్పారు.
గ్రామస్థులపై ప్రభావం చూపని విషం..
పాముల దేవత అయిన మానస మాత శక్తుల కారణంగా విష సర్పాలు గ్రామస్థులకు స్నేహితులుగా మారుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. దాని ఫలితంగా ఈ విష సర్పాలు కరిచినప్పటికీ, వాటి విషం ఈ భక్తులపై ఎటువంటి ప్రభావం చూపదని చెబుతారు. మానసదేవి పూజ పూర్తయిన తర్వాత గ్రామస్థులు పట్టుకున్న విషపూరితమైన పాములను అడవులకు తీసుకెళ్లి తిరిగి అక్కడ వదిలివేస్తారు. మానస దేవిని పూజించడం వల్ల సర్ప శాపం తొలగిపోతుందని ఇక్కడి గ్రామస్థులు చెబుతున్నారు. ఏదేమైనా ఇదో వింత ఆచరమని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: food waste penalty: ఫుడ్ వేస్ట్ చేస్తున్నరా.. అయితే మీకు ఫైన్ వేస్తారు జాగ్రత్త !