Chandrayaan 3: చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం ఎదురుచూస్తున్న సెలబ్రెటీలు, ట్విటర్ వేదికగా కోరుకున్న సౌత్ స్టార్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan 3: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ చంద్రయాన్ 3. విక్రమ్ రోవర్ ఈ రోజు చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టబోతుంది. ఇదే కనుక జరిగే భారత్ అంతరిక్ష పరిశోధనలో ఎలైట్ లిస్ట్ లో చేరుతుంది. అంతేకాకుండా జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్రకెక్కుతుంది. చంద్రయాన్ 3 చందమామపై సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టాలని దేశ వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఎక్కడ చూసిన చంద్రయాన్ 3 గురించే చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి లైవ్ స్ట్రీమింగ్ ను కూడా ఇస్రోతో పాటు చాలా ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. ఆ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భారత్ తో పాటు యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. జాబిల్లి రహస్యాలను తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే అన్ని ఘట్టాలను ఒక్కొక్కటిగా దాటుకుంటు వెళుతున్న చంద్రయాన్ 3 ఆఖరి ఘట్టంలోకి మరికొన్ని గంటల్లో అడుగుపెట్టబోతుంది. ఇక ఇది సక్సెస్ అవ్వాలని చాలా మంది దేవుడిని ప్రార్థిస్తు ఇస్రోకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఇక ఆ లిస్ట్ లోకి సౌత్ ఇండియన్ సెలబ్రెటీలు కూడా చేరారు. ఎంతో బిజీగా ఉండే వారు ట్విటర్ వేదికగా చంద్రయాన్ 3 విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇది భారతీయులందరు గర్వించదగిన నిమిషం అని పేర్కొ్నారు.
Also Read: Varun Tej: పెళ్లి తరువాత బన్నీ, చరణ్ ఎలా మారిపోయారో చెప్పిన వరుణ్ తేజ్
Also Read
- Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
- AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3-4 రోజులు అతి భారీ వర్షాలు!
- Rahul Gandhi: బీజేపీ బలవంతంగా దుకాణాలు మూసివేయించింది.. రాహుల్ సంచలన ఆరోపణలు!
- YS Jagan: ఓటర్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?.. RO చిన్నయ్యకు జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం..
హీరో మాధవన్ చంద్రయాన్ 3 ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని, తన మాటలు రాసిపెట్టుకోండని ట్వీట్ చేశాడు. ఇస్రోకు ముందుగానే కంగ్రాట్స్ చెబుతున్నట్లు పేర్కొన్నాడు. నంబినారాయణ్ కు కూడా ఈ సందర్భంగా మాధవన్ కంగ్రాట్స్ చెప్పాడు. నంబినారాయణ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన రాకెట్రీ అనే సినిమాలో మాధవన్ నటించిన విషయం తెలిసిందే.
Chandrayaan-3 WILL BE ABSOLUTE SUCCESS —- MARK MY WORDS . Congratulations @isro .. IN ADVANCE .. on this spectacular success .. I AM SO SO HAPPY AND PROUD … congratulations to @NambiNOfficial too .. Vikas engine delivers yet once again during the launch.…
— Ranganathan Madhavan (@ActorMadhavan) August 23, 2023
ఇక కాంతారాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి కూడా ట్విటర్ వేదికగా చంద్రయాన్ 3 పై స్పందించారు. చంద్రయాన్ 3 పంపిన జాబిల్లి ఫోటోలను ఆయన షేర్ చేసుకున్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి అని, దీనిని వీక్షించే అవకాశవం లభించడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని పేర్కొన్నాడు. చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందామని రిషబ్ శెట్టి పేర్కొన్నారు.
ನಾಳೆ ನಮ್ಮ ದೇಶ ಮತ್ತೊಂದು ಮೈಲಿಗಲ್ಲಿಗೆ ಸಾಕ್ಷಿಯಾಗಲಿದೆ.
Tomorrow marks yet another milestone for India, thrilled to be part of witnessing this historic day.Let's join in prayer for the safe landing of the #VikramLander🇮🇳#Chandrayaan_3 #Chandrayaan3Landing #ISROMissions #ISRO #India… pic.twitter.com/dNQSARtn0J
— Rishab Shetty (@shetty_rishab) August 22, 2023
ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ట్విటర్ వేదికగా చంద్రయాన్ 3పై స్పందించారు. ఎంతో గర్వకారణమైన నిమిషం అంటూ చంద్రయాన్ 3 కి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇక ప్రకాశ్ రాజ్ ఒక్కడే చంద్రయాన్ 3 గురించి వెరైటీ ట్వీట్ చేసి విమర్శలపాలయిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఆర్వో ఆఫీసు ముందు బైఠాయించిన జగన్!
-
Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
-
AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3-4 రోజులు అతి భారీ వర్షాలు!
-
Rahul Gandhi: బీజేపీ బలవంతంగా దుకాణాలు మూసివేయించింది.. రాహుల్ సంచలన ఆరోపణలు!
-
GST Collection: జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్లో రూ.2.31 లక్షల కోట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
-
YS Jagan: ఓటర్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?.. RO చిన్నయ్యకు జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!