India Missile Test: భారతదేశం కీలక పరీక్షలకు సిద్ధం అవుతుంది. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో బంగాళాఖాతంలో ఇండియా క్షిపణులను పరీక్షించనుంది. ఈ పరీక్షలను అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పరీక్షల నేపథ్యంలో ఇప్పటికే ఎయిర్‌మెన్‌లకు నోటీసు (NOTAM) జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ భారతదేశం తన క్షిపణి సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి, పరీక్షించడానికి చేస్తున్న నిరంతర ప్రయత్నాలను సూచిస్తుంది.
READ ALSO: ACB Raids: కుప్పలు.. కుప్పలుగా నోట్ల కట్టలు.. భారీగా అక్రమాస్తులు గుర్తింపు!
సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 25 మధ్యాహ్నం 3:30 గంటల వరకు బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో నో-ఫ్లై జోన్‌గా ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నో ఫ్లై జోన్ ప్రాంతం పొడవు దాదాపు 1,430 కిలోమీటర్లుగా పేర్కొంది. ఈ సమయంలో విమానాలు లేదా ఓడలు సముద్రంలోని ఆ ప్రాంతంలో సంచరించవద్దని నోటిఫికేషన్‌లో సూచించింది. ఈ సమయంలో ఇండియా దీర్ఘ-శ్రేణి క్షిపణిని పరీక్షించనున్నట్లు సమాచారం. ఈ క్షిపణి పరీక్ష పరిధి 1,500 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంటుందని వినికిడి.
ఇప్పటికే విజయవంతమైన ‘అగ్ని 5’..
ఇటీవల భారతదేశం 5 వేల కి.మీ.ల పరిధి కలిగిన మధ్యస్థ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని 5’ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ పరీక్షా కేంద్రం నుంచి నిర్వహించిన ఈ పరీక్ష సక్సె్స్ అయినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అగ్ని-5 క్షిపణి చైనా ఉత్తర భాగం, యూరప్‌లోని కొన్ని ప్రాంతాలతో సహా దాదాపు మొత్తం ఆసియాను కవర్ చేయగలదు. ఈ క్షిపణి హిందూ మహాసముద్రంలో తన లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించడంలో విజయవంతమైంది. పాకిస్థాన్, చైనా, టర్కీలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం అగ్ని-5 క్షిపణికి ఉంది.
READ ALSO: Diamer Bhasha Dam: సింధూ నదిపై పాక్ ఆనకట్ట.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత్