INF VS PAK Final: ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ ఓటమి.. సీనియర్లను దాటలే కదా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్స్ కానీ, జూనియర్స్ కానీ ఒక్కటే ఫార్ములాను వాడుతున్నట్లుంది. మొన్నటికి మొన్న ప్రపంచ ఛాంపియన్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో సీనియర్స్ ఓడితే.. ఇప్పుడు ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్ జూనియర్లు అదే సీన్ రిపీట్ చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత క్రికెట్ అభిమానులు నిరాశలయ్యాయి. ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‌లో భారత A జట్టు, పాకిస్తాన్ A జట్టు చేతిలో 128 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. మొదట టాస్ గెలిచిన భారత్.. పాకిస్తాన్‌కి బ్యాటింగ్ అప్పగించింది. దీంతో పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 352 పరుగుల భారీ స్కోరు చేసింది.
Kannada Actresses: మొన్న సౌందర్య.. నేడు జగతి.. భర్తలను వదిలి.. వారితో ఎఫైర్.. ?
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
పాకిస్తాన్ బ్యాటింగ్ లో ఓపెనర్లు సయిం ఆయుబ్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేయగా.. సహీబ్‌జాదా ఫర్హాన్ 62 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. 29 ఏళ్ల తయ్యాబ్ తాహీర్ 71 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో విధ్వంసం సృష్టించడంతో 108 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ బ్యాట్స్ మెన్ సెంచరీ చేయడంతోనే పాక్ స్కోరు భారీ దిశగా వెళ్లింది. ఇక భారత బౌలర్లలో రాజవర్థన్ హంగర్‌గేకర్, రియాన్ పరాగ్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, మనవ్ సుథార్, నిశాంత్ సింధులకు తలా వికెట్ పడగొట్టారు.
Health Tips : రోజూ రాత్రి ఒక లవంగాన్ని తింటే ఏం జరుగుతుందో తెలుసా?
353 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రంగంలోకి దిగిన టీమిండియాకి శుభారంభం దక్కింది. 28 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసిన సాయి సుదర్శన్, అభిషేక్ శర్మతో కలిసి తొలి వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. అయితే అర్షద్ ఇక్బాల్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. అయితే ఈ బంతి నో బాల్‌గా టీవీ రిప్లైలో ఇచ్చినప్పటికీ.. థర్డ్ అంపైర్ మాత్రం ఔట్ అనే ఇచ్చాడు. మరో బ్యాటర్ నికిన్ జోష్ కూడా బ్యాట్ కు తగలనప్పటికీ.. అంపైర్ అవుట్ ఇచ్చాడు. కేవలం ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. 51 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 61 పరుగులు చేసాడు. మరోవైపు కెప్టెన్ యష్ ధుల్ 41 బంతుల్లో 4 ఫోర్లతో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతోనే టీమిండియా ఓటమి ఖరారైపోయింది. నిశాంత్ సింధు 10, ధృవ్ జురెల్ 9, రియాన్ పరాగ్ 14, హర్షిత్ రాణా 13, రాజవర్థన్ హంగర్‌గేకర్ 11 పరుగులు చేసి వెంటవెంటనే ఔటయ్యారు. చివరలో యువరాజ్‌సిన్హా దోహియా 5 పరుగులు చేసి అవుట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ 224 పరుగుల వద్ద ముగిసింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!