Kannada Actresses: చిత్ర పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు.. ఎప్పుడు మొదలవుతాయి.. ఎప్పుడు ముగుస్తాయి అనేది చెప్పడం చాలా కష్టం. ఇక సినిమా నటీమణులే కాదు సీరియల్ నటీమణులు కూడా పెళ్లిళ్ల విషయంలో తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కన్నడ సీరియల్ నటీమణులు ఇద్దరు.. భర్తలను వదిలి.. మరొకరితో ఎఫైర్ లు నడిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు తల్లిగా సౌందర్య అనే పాత్రలో నటించి మెప్పించింది అర్చన అనంత్. ఈ సీరియల్ ఆమెకు ఎంతోమంచి పేరును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈమె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అనే సీరియల్ లో నటిస్తోంది. ఇక అర్చన గత కొన్నాళ్లుగా భర్తను వదిలి మరొక వ్యక్తితో సహజీవనం చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా చిత్ర పరిశ్రమకు చెందినవారే అని, వయస్సు మళ్ళిన వాడు అని సమాచారం. అయితే ఈ విషయమై ఆమె ఏనాడు స్పందించింది లేదు.
Sunny Leone: ఆ వీడియోస్ వలనే నా తల్లి దానికి బానిసగా మారింది
ఇక ఈమె బాటలోనే మరో నటి కూడా నడుస్తుందని రూమర్స్ గుప్పుమంటున్నాయి. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషికి తల్లిగా జగతి అనే పాత్రలో నటించిన నటి జ్యోతి రాయ్. కన్నడలో ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన జ్యోతి.. ఇప్పుడు సీరియల్స్ తో బిజీగా మారింది. ఇరాక్ జగతి పాత్రతో మరింత ఫేమస్ అయిన ఆమె.. భర్తను వదిలి ఒక డైరెక్టర్ తో ఎఫైర్ సాగిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో శుక్ర, మాటరాని మౌనమిది లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సుకు పుర్వాజ్‌తో ఆమె రిలేషన్ లో ఉందని టాక్ నడుస్తోంది. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లవ్ సింబల్స్ పెట్టడంతో అనుమానాలు రేకెత్తాయి. జ్యోతిరాయ్‌కి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి కాగా.. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. ఇక ఆ తరువాత వీరిద్దరూ విడిపోయారని.. ఇప్పుడు జ్యోతి.. ఈ డైరెక్టర్ తో ప్రేమాయణం సాగిస్తుందని వార్తలు వస్తున్నాయి, ఇందులో నిజమెంతఅనేది తెలియాల్సి ఉంది.