Mexico Gen Z Protests: మెక్సికోలో జెన్-జెడ్ తిరుగుబాటు! రోడ్లపైకి వేలాదిగా నిరసనకారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mexico Gen Z Protests: జనరల్-జెడ్.. నేపాల్‌ను అతలాకుతలం చేసిన పేరు. ఇప్పుడు ఈ జనరల్ జెడ్ మెక్సికో వరకు పాకింది. ఇప్పుడు మెక్సికోలో జనరల్-జెడ్ తిరుగుబాటుకు సిద్ధమవుతోంది. దేశంలో పెరుగుతున్న నేరాల రేట్లు, అవినీతికి వ్యతిరేకంగా ప్రదర్శనలు ఇవ్వడానికి మెక్సికో అంతటా వేలాది మంది ప్రజలు గుమిగూడారు. శనివారం దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది యువకులు నిరసన తెలిపారు. ఈ నిరసన మార్చ్‌లో వివిధ వయసుల వారు పాల్గొన్నారు, వీరిలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన వృద్ధ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇటీవల హత్యకు గురైన మిచోకాన్ మేయర్ కార్లోస్ మాంజో మరణంపై దేశంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజా నిరసనలో మాంజో మద్దతుదారులు కూడా పాల్గొన్నారు.
READ ALSO: Bihar: బీహార్ పవర్ షేరింగ్.. ఎన్డీయేలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే?
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
మెక్సికోలో వెల్లువెత్తిన నిరసనలు..
మీడియా నివేదికల ప్రకారం.. అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ నివసించే మెక్సికో నగరంలోని నేషనల్ ప్యాలెస్ చుట్టూ నిరసనకారులు బారికేడ్లను ఛేదించడంతో పోలీసులు మోహరించారు. నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసనకారుల సమూహం దాడిలో 100 మంది పోలీసు అధికారులు గాయపడ్డారని, వారిలో 40 మంది ఆసుపత్రి పాలయ్యారని మెక్సికో నగర ప్రజా భద్రతా కార్యదర్శి పాబ్లో వాజ్క్వెజ్ ఒక విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 మంది పౌరులు కూడా గాయపడ్డారని చెప్పారు. అలాగే ఈ నిరసనలకు సంబంధించి 20 మందిని అరెస్టు చేశారని, మరో 20 మందిని పరిపాలనా నేరాలకు రిఫర్ చేశారని చెప్పారు.
నిరసనలకు కారణం ఏమిటి ?
అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ మాదకద్రవ్యాల ముఠాలతో కుమ్మక్కయ్యారని జెన్-జి ఆరోపిస్తున్నారు. క్లాడియా షీన్‌బామ్ అమెరికా విధానాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో, వెనిజులాకు మద్దతు ఇవ్వడంలో ప్రసిద్ధి చెందారు. అధ్యక్షుడు ట్రంప్‌పై బహిరంగ విమర్శలతో ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు జెన్-జి భారీ నిరసనలు అధ్యక్షురాలు క్లాడియా ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. అలాగే అక్టోబర్ 2024 నుంచి అధికారంలో ఉన్న షీన్‌బామ్ తన మొదటి సంవత్సరంలో 70 శాతానికి పైగా ప్రజాదరణను పొందారు. అయితే నవంబర్ 1న తన నగరంలో మాదకద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా ప్రచారానికి నాయకత్వం వహిస్తూ కాల్చి చంపబడిన మిచోకాన్‌లోని ఉరుపాన్ మేయర్ కార్లోస్ మాంజోతో సహా అనేక ఉన్నత స్థాయి హత్యల తర్వాత ఆమె భద్రతా విధానాలు విమర్శలకు గురయ్యాయి. తాజాగా ఘటనపై మెక్సికన్ వార్తా సంస్థ ఎల్ యూనివర్సల్ నివేదికల ప్రకారం.. నిరసనకారులు నేషనల్ ప్యాలెస్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశిస్తుండగా భద్రతా దళాలు భాష్ప వాయువును ప్రయోగించి, రాళ్ళు విసిరాయి. “జోకాలోలో ప్రదర్శన చేస్తున్న యువకులపై వారి కవచాలు, రాళ్లతో వారు (భద్రతా దళాలు) దాడి చేశారని వెల్లడించింది.
READ ALSO: Social Media Ban: డిసెంబర్ 10 నుంచి సోషల్ మీడియా బ్యాన్.. ఎక్కడో తెలుసా!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!