ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అక్రమ అరెస్టులను తాము తీవ్రంగా ఖండిస్తున్నాం అని వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. దొంగ సాక్షాలు, అబద్ధపు స్టేట్మెంట్స్ తో ఈ అరెస్ట్ జరిగిందన్నారు. టీడీపీ, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉందని విమర్శించారు. మాజీ సీఎం వైస్ జగన్ తెచ్చిన సోలార్ ప్రాజెక్టులను తాను తెచ్చినట్లు మంత్రి నారా లోకేష్ చెప్పడం సిగ్గుచేటు అని శ్యామల ఫైర్ అయ్యారు. రెండు రోజుల అనంత పర్యటనలో నారా లోకేష్ సాధించింది శూన్యం అని ఎద్దేవా చేశారు. ఏపీ లిక్కర్ స్కాంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు నిందితులుగా ఉన్నారు.
Also Read: shobhana : బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న సీనియర్ నటి
వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ… ‘ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. దొంగ సాక్షాలు, అబద్ధపు స్టేట్మెంట్స్ తో ఈ అరెస్ట్ జరిగింది. టీడీపీ, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉంది. సోలార్ ప్రాజెక్టులను ఏపీలో విస్తారంగా తెచ్చిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే. జగన్ తెచ్చిన సోలార్ ప్రాజెక్టులను తాను తెచ్చినట్లు నారా లోకేష్ చెప్పడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ పాలనలో 22 వేల కోట్ల రూపాయల విలువైన సోలార్ ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో భాగంగానే రెన్యూ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టింది. ఏపీలో నారా లోకేష్ సకల శాఖ మంత్రి, అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలను మంత్రి లోకేష్ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ఎందుకు ఆపేశారో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎందుకు విడుదల చేయలేదు?. రెండు రోజుల అనంత పర్యటనలో నారా లోకేష్ సాధించింది శూన్యం’ అని చెప్పారు.