Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్‌లో ఈ85 ఎందుకు సవాల్‌గా మారుతుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Explained: ఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి ఈ85 (E85) ఇంధన పంప్ ప్రారంభం కావడంతో భారత్ ఇథనాల్ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ప్రస్తుతం రాజధాని నగరంలో లీటర్ ఈ20 పెట్రోల్ ధర సుమారు రూ. 102 పలుకుతుండగా, ఈ కొత్త ఈ85 ఇంధనాన్ని లీటరు రూ. 82.12 కే అందిస్తున్నారు. అంటే ఈ టీ20 పెట్రోల్ కంటే ఇది లీటరుకు ఏకంగా రూ. 20 చౌకగా లభిస్తోంది. పైకి చూసేందుకు ఈ ధరల వ్యత్యాసం చాలా ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ, కేవలం ఇంధనం ధర తక్కువగా ఉన్నంత మాత్రాన ఈ ప్రయోగం విజయవంతం కాదు. ఇప్పటికే ఫ్లెక్స్-ఫ్యూయల్ కింగ్‌గా పేరుగాంచిన బ్రెజిల్ అనుభవాలు మనకు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రెజిల్లో ఏం జరిగింది?
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ‘ఫ్లెక్స్-ఫ్యూయల్’ (Flex-fuel) మార్కెట్‌గా బ్రెజిల్‌కు గుర్తింపు ఉంది. అక్కడ చెరకు ఆధారంగా ఇథనాల్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తూ, పెట్రోల్ లేదా ఇథనాల్.. ఇలా దేనితోనైనా నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలను ప్రోత్సహించేలా ఓ బలమైన వ్యవస్థను సృష్టించారు. ప్రస్తుతం బ్రెజిల్లో అమ్ముడవుతున్న మెజారిటీ కొత్త కార్లు ఈ సాంకేతికతతోనే వస్తున్నాయి. అయితే, బ్రెజిల్ మోడల్ విజయవంతం కావడానికి కేవలం ప్రభుత్వ విధానాలు మాత్రమే కారణం కాదు. ఇథనాల్ ఇంధనం వినియోగదారులకు స్పష్టమైన ఆర్థిక ప్రయోజనాన్ని (పొదుపును) అందించడమే అసలు రహస్యం.
Also Read
- 200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!
- IMD: భారత్‌కు ఐఎండీ కీలక హెచ్చరిక.. ఈ ఏడాది కరువు తప్పదా?
- APL 2026: చివరి బంతి వరకు ఉత్కంఠ.. తుంగభద్ర వారియర్స్ సంచలన విజయం
70 శాతం నియమం ఏంటి?
బ్రెజిల్ వాహనదారులు ఇథనాల్ వాడేటప్పుడు ఒక కీలకమైన 70 శాతం నియమాన్ని (70 per cent rule) పాటిస్తారు. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో శక్తి సాంద్రత (Energy density) తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇథనాల్‌తో నడిచే వాహనాలు లీటరుకు ఇచ్చే మైలేజ్, పెట్రోల్ వాహనాల కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇథనాల్ ధర పెట్రోల్ ధరలో 70 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది వాహనదారులకు ఆర్థికంగా లాభదాయకంగా మారుతుంది. అక్కడి ప్రభుత్వం సైతం ఇదే స్థాయిలో రేట్లను కొనసాగిస్తూ వస్తోంది. కానీ.. ప్రస్తుత ఢిల్లీ ధరల ప్రకారం చూస్తే, ఈ85 ధర (రూ. 82.12) పెట్రోల్ ధరలో సుమారు 80 శాతంగా ఉంది. ప్రతి లీటరుకు రూ. 20 ఆదా అవుతున్నట్లు అనిపించినా మైలేజ్ విషయానికి వచ్చే సరికి ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే.. ఇథనాల్ ఇంధన సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల, పెట్రోల్ నుంచి ఈ85 కి మారినప్పుడు వాహనాల మైలేజ్ 20 నుంచి 30 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది. అదే కనుక జరిగితే, లీటరుపై ఆదా అవుతుందనుకున్న రూ. 20 లాభం కాస్తా మైలేజ్ నష్టంతో హరించుకుపోతుంది. కొన్ని సార్లు నష్టం కూడా జరుగుతుంది.
బ్రెజిల్ అనుభవం ఏం చెబుతోంది?
బ్రెజిల్ అనుభవం ప్రకారం.. ఇథనాల్ ధర పెట్రోల్ కంటే 30-35 శాతం తక్కువగా ఉన్నప్పుడే ప్రజలు దానిని ఎగబడి కొంటారు. కానీ ఆ వ్యత్యాసం 20-25 శాతానికి పడిపోతే, మైలేజ్ తగ్గిపోవడం వల్ల వచ్చే నష్టం ముందు ఈ తక్కువ ధర పెద్దగా ఆకర్షణీయంగా అనిపించదు. ఇప్పుడు ఢిల్లీలో ఇస్తున్న 20 శాతం తగ్గింపు, వాహనదారులను ఈ85 వైపు తిప్పుకోవడానికి సరిపోకపోవచ్చు. బ్రెజిల్ సూత్రం ప్రకారం చూస్తే.. పెట్రోల్ ధర రూ. 100 ఉన్నప్పుడు, ఇథనాల్ ధర రూ. 82 కాకుండా రూ. 70 కి అటుఇటుగా ఉంటేనే జనం దీనిపై ఆసక్తి చూపిస్తారు. ధరల సవాలు మాత్రమే కాదు, మౌలిక వసతుల కొరత కూడా మరో పెద్ద అడ్డంకి. బ్రెజిల్లో ఎక్కడ చూసినా ఇథనాల్ బంకులు అందుబాటులో ఉంటాయి. కానీ మనదేశంలో ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. 2027 నాటికి దేశవ్యాప్తంగా 5,000 ఇథనాల్ బంకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రస్తుతం ఫ్లెక్స్-ఫ్యూయల్ బంకులు కానీ, ఆ వాహనాలు కానీ మార్కెట్లో చాలా అరుదుగా ఉన్నాయి. ఇది ‘కోడి ముందా-గుడ్డు ముందా’ అనే చందంగా మారింది. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా నెట్వర్క్ లేకపోతే వాహన తయారీ సంస్థలు ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లను భారీగా ఉత్పత్తి చేయలేవు. పోనీ కార్లు రోడ్ల మీద ఎక్కువగా లేనప్పుడు బంకుల యజమానులు ఇథనాల్ పంపుల కోసం భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు.
ఏది ఏమైనప్పటికీ.. ఈ85 ప్రయత్నం విఫలమవుతుందని అనుకోలేం. ఎందుకంటే ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి, దేశీయ వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి, ఇంధన భద్రతను సాధించడానికి భారతదేశానికి ఇథనాల్ చాలా వ్యూహాత్మకమైనది. దేశ ప్రయోజనాల దృష్ట్యా వినియోగదారులకు ప్రారంభంలో తక్కువ పొదుపు లభించినా ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఏదేమైనా, వినియోగదారులు ఎప్పుడూ ప్రభుత్వ ఆశయాల కంటే తమ జేబు గురించే ఆలోచిస్తారనేది బ్రెజిల్ నిరూపించిన సత్యం. ఈ85 కేవలం ఒక ప్రయోగంగా మిగిలిపోకుండా సాధారణ ప్రజల ఇంధనంగా మారాలంటే, అది పెట్రోల్ కంటే స్పష్టమైన ‘కాస్ట్-పర్-కిలోమీటర్’ ప్రయోజనాన్ని చూపించాల్సిందే. ప్రస్తుతానికైతే లీటరుకు రూ. 20 తగ్గింపు అనేది ఒక మంచి ఆరంభం. అయితే, మైలేజ్ లోటును అధిగమించి ఈ తగ్గింపు ఎంతవరకు నిలబడుతుందనేదే ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ విప్లవ విజయాన్ని నిర్ణయిస్తుంది.
తాజావార్తలు
-
Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్‌లో ఈ85 ఎందుకు సవాల్‌గా మారుతుంది?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!
-
Lenin Movie Postponed : “లెనిన్” రిలీజ్ వాయిదా… జూలై సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ?
-
Bhogi Climax Shoot : క్లైమాక్స్ షూట్ లో “భోగి”… 20 రోజుల పాటు మెగా షెడ్యూల్
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!