Lenin Movie Postponed : “లెనిన్” రిలీజ్ వాయిదా… జూలై సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenin Movie Postponed : ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో యువ హీరోల సినిమాలపై ప్రేక్షకుల అంచనాలు ఎలా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి టైటిల్, ఆకట్టుకునే గ్లింప్స్, హార్ట్ టచింగ్ పాటలు ఉంటే చాలు, సినిమా విడుదలకు ముందే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంటుంది. ప్రస్తుతం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘లెనిన్’ ఒకటి. అయితే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా ఒక చిన్న నిరాశ ఎదురైంది. ఈ నెల 26న విడుదల కావాల్సిన ‘లెనిన్’ చిత్రం వాయిదా పడినట్లు సమాచారం బయటకు రావడంతో అభిమానులు నిరాశచెందుతున్నారు.
సినిమా వర్గాల సమాచారం ప్రకారం, ‘లెనిన్’ చిత్రం అనుకున్న తేదీకి విడుదల కాకుండా జూలై మధ్యలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారికంగా కొత్త విడుదల తేదీ ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, వాయిదా వార్త మాత్రం అభిమానుల్లో చర్చకు దారి తీసింది. అయితే చిత్రబృందం సినిమా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, మరింత మెరుగైన అవుట్పుట్తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
‘లెనిన్’పై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా సినిమా టైటిల్ గ్లింప్స్, ‘సోల్ ఆఫ్ లెనిన్’ వంటి ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో భారీ ఆదరణ పొందాయి. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇక తెలుగు సినిమా చరిత్రను పరిశీలిస్తే జూలై నెల అనేక బ్లాక్బస్టర్ చిత్రాలకు వేదికగా నిలిచింది. ‘ఇంద్ర’, ‘సింహాద్రి’, ‘మగధీర’, ‘బాహుబలి’ వంటి భారీ విజయాలు సాధించిన చిత్రాలు కూడా ఇదే కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందుకే చాలామంది అభిమానులు ‘లెనిన్’ విడుదల వాయిదాను ప్రతికూలంగా భవించడంలేదు. మంచి సినిమా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్.
అక్కినేని అభిమానుల అంచనాలు కూడా ఈ సినిమాపై భారీగా ఉన్నాయి. గత కొంతకాలంగా సరైన మాస్, ఎమోషనల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ‘లెనిన్’పై ప్రత్యేక ఆశలు పెట్టుకున్నారు. అఖిల్ కెరీర్ కి కూడా ఈ సినిమా హిట్ చాలా అవసరం. ప్రమోషన్స్ కు వస్తున్న స్పందనను చూస్తే సినిమా విడుదలకు ముందే మంచి క్రేజ్ సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే విడుదల తేదీ మారినా, సినిమా ప్రభావం తగ్గదనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికైతే ‘లెనిన్’ అభిమానులు ఇంకొన్ని వారాలు ఓపిక పట్టాల్సిందే. కానీ ఆలస్యంగా వచ్చినా భారీ విజయంతో రావాలనే ఆశతో అందరూ ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలైన తర్వాత ఈ అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ‘లెనిన్’ జూలై విడుదలపై అందరి దృష్టి ఉంది.
- Tags
- cinema
- Lenin Movie
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..