IMD: భారత్‌కు ఐఎండీ కీలక హెచ్చరిక.. ఈ ఏడాది కరువు తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IMD: ప్రస్తుత నైరుతి రుతుపవనాల కాలంలో భారత్‌కు ఒక కీలకమైన హెచ్చరిక వెలువడింది. పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ (El Nino) పరిస్థితులు అధికారికంగా ప్రారంభమయ్యాయని భారత వాతావరణ శాఖ (IMD) తన జూన్ 2026 బులెటిన్‌లో స్పష్టం చేసింది. సాధారణంగా ఎల్ నినో అంటేనే భారతీయ రైతులకు, వాతావరణ నిపుణులకు గుండెల్లో రాయి పడ్డట్లే. ఎందుకంటే దీని ప్రభావం వల్ల దేశంలో వర్షాలు తగ్గిపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం, తీవ్రమైన అనావృష్టి లేదా కరవు పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉంటుంది.
ప్రస్తుతం కేంద్ర, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతూ ఎల్ నినో స్థాయిని దాటేశాయి. కేవలం సముద్రపు నీరు వేడెక్కడం మాత్రమే కాకుండా, దానికి తగ్గట్టుగా వాతావరణంలోనూ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే సముద్రం, వాతావరణం రెండూ కలిసి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎల్ నినో వైపు అడుగులు వేశాయని వాతావరణ శాఖ విశ్లేషించింది. ఎల్ నినో తీవ్రతను కొలిచే కీలకమైన ‘నినో 3.4 ఇండెక్స్’ సగటు గడిచిన మూడు నెలల్లో +0.5 డిగ్రీల సెల్సియస్ దాటడంతో దీని రాక అధికారికంగా ఖరారైంది.
Also Read
- Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
- Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
- Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
- Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
నిజానికి ఇది ఇక్కడితో ఆగేలా లేదు. పసిఫిక్ మహాసముద్రం లోపలి పొరల్లో కూడా విపరీతమైన వేడి ఉంది. దీనివల్ల రాబోయే రోజుల్లో మరింత వేడి నీరు పైకి వచ్చి, ఎల్ నినోను మరింత బలపరిచే అవకాశం ఉంది. జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో పసిఫిక్ వ్యాప్తంగా ఈ వేడి మరింత విస్తరించి, జూలై తర్వాత ఇది మరింత తీవ్ర రూపం దాల్చవచ్చని మాన్సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్కాస్ట్ సిస్టమ్ (MMCFS) అంచనా వేస్తోంది. ఈ నైరుతి రుతుపవనాల సీజన్ అంతటా ఇది ‘మధ్యస్థం నుంచి తీవ్ర’ స్థాయిలో కొనసాగే ప్రమాదం ఉందని వాతావరణ నమూనాలు చెబుతున్నాయి.
అయితే, ఎల్ నినో వచ్చినంత మాత్రాన రుతుపవనాలు పూర్తిగా దెబ్బతింటాయని భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశ వర్షపాతాన్ని శాసించే మరో కీలక అంశం ‘ఇండియన్ ఓషన్ డైపోల్’ (IOD). ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో ఐఓడీ పరిస్థితులు తటస్థంగా (Neutral) ఉన్నాయి. ఈ తటస్థ స్థితి వల్ల ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించడానికి కానీ, లేదా మరింత పెంచడానికి కానీ దీని నుంచి ఎటువంటి మద్దతు లభించదు. కానీ, ఈ ఆందోళనల మధ్య జపాన్ వాతావరణ సంస్థ (JMA) ఒక ఆశాజనకమైన విషయాన్ని తెరపైకి తెచ్చింది. జూన్ 11నే ఎల్ నినో ప్రారంభాన్ని ప్రకటించిన జపాన్ శాస్త్రవేత్తల ప్రకారం… రాబోయే జూలై నాటికి హిందూ మహాసముద్రంలో ‘పాజిటివ్ ఐఓడీ’ (Positive IOD) ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, పసిఫిక్‌లో ముంచుకొస్తున్న ఈ ‘సూపర్ ఎల్ నినో’ సృష్టించబోయే విధ్వంసాన్ని, నష్టాన్ని పాజిటివ్ ఐఓడీ కొంతవరకు అడ్డుకుని, భారతదేశానికి రక్షణ కవచంగా మారే అవకాశం ఉంది. రాబోయే కాలంలో పసిఫిక్, హిందూ మహాసముద్రాలలో మారబోయే ఈ వాతావరణ పరిస్థితులను నిరంతరం నిశితంగా గమనిస్తూ, ప్రతి నెలా అప్డేట్స్ ఇస్తామని భారత వాతావరణ శాఖ భరోసా ఇచ్చింది. అంతా సవ్యంగా సాగి, ప్రకృతి భారతావనికి మేలు చేయాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
KTR : 2028లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!