AUS vs IND: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ‘ఫాలో ఆన్’ ప్రమాదం నుంచి బయటపడింది. జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ చివరి వికెట్‌కు 39 పరుగుల కీలక భాగస్వామ్యం అందించడంతో టీమిండియా ‘ఫాలో ఆన్’ గండం నుండి బయట పడింది. వీరి మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ జట్టు ‘ఫాలో ఆన్’ ముప్పును తప్పించుకుంది. ఈ కారణంతో డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
Also Read: SBI Clerk Vacancy 2024: ఎస్‌బిఐలో ఉద్యోగాల జాతర.. ఏకంగా 13,735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మొదటి నుంచి వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఇక టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ (84), జడేజా (77) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత్ స్కోర్‌బోర్డును ముందుకు నడిపించారు. అయితే, చివరిలో టెయిలెండర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ మరో వికెట్ పడకుండా విలువైన పరుగులు సాధించడంతో భారత్‌ను ‘ఫాలో ఆన్’ ప్రమాదం నుంచి గట్టెక్కించారు.
Also Read: WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు కడప జిల్లా విద్యార్థిని.. హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
ఇక రూల్స్ ప్రకారం.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయడంతో.. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేయకపోతే ‘ఫాలో ఆన్’లో పడినట్లు అవుతుంది. అప్పుడు ఆస్ట్రేలియా ఆహ్వానిస్తే, భారత్ మళ్లీ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉండేది. అయితే, భారత్ 246 పరుగులు దాటించి ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. ఇక భారత్‌ను రెండో ఇన్నింగ్స్ కోసం బ్యాటింగ్‌కు ఆహ్వానించాలా, వద్దా అనేది ఆస్ట్రేలియా ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఇంకా ఒక్కరోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఒకవేళ టీమిండియా ఆలౌట్ అయినా రెండో ఇన్నింగ్స్‌లో ముందుగా బ్యాటింగ్ చేయాల్సిన బాధ్యత ఆస్ట్రేలియాదే. దీంతో భారత్‌కు మ్యాచ్‌ను డ్రా చేసుకునే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.