మన దేశంలో నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 10,853 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 3,37,49, 900 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,44,845 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 260 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4, 60, 791 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో ఇండియాలో 12,432 మంది కరోనా నుంచి కోలుకోగా, 28,40, 174 మంది టీకాలు తీసుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,08,21,66,365 మంది టీకాలు తీసుకున్నారు.