Site icon NTV Telugu

IND vs AUS: ఆదుకున్న కోహ్లీ, రాహుల్.. ప్రపంచకప్‌లో భారత్‌ బోణీ

Match

Match

IND vs AUS: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్‌ బోణీ కొట్టింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. కేఎల్ రాహుల్ (97*), విరాట్ కోహ్లి (87)ల అద్భుత ఇన్నింగ్స్‌లు భారత్‌కు ప్రపంచకప్‌లో విజయవంతమైన ఆరంభాన్ని అందించాయి. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 199 పరుగులకే ఆలౌటైంది. ఇక భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు తీయగా.. బుమ్రా, కుల్‌దీప్ రెండేసి వికెట్లు తీశారు. పాండ్యా, సిరాజ్‌, అశ్విన్‌ తలో వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటింగ్ లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 41 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన స్టీవ్ స్మిత్ 46 పరుగులు చేశాడు. తర్వాత లబుషేన్ 27, మ్యాక్స్ వెల్ 15, అలెక్స్ క్యారీ 0, కెమెరాన్ గ్రీన్ 8, కమిన్స్ 15, స్టార్క్ 28, ఆడం జంపా 6 పరుగులు చేశారు.

Exgratia: అత్తిబెలె అగ్ని ప్రమాద బాధిత కుటుంబీలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ (0), ఇషాన్ కిషన్ (0), శ్రేయాస్ అయ్యర్ (0) రూపంలో ఆ జట్టు కేవలం రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇక మ్యాచ్ పని ముగిసిందని అందరు అనుకున్న సమయంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ నాలుగో వికెట్‌కు 165 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో భారత్ శుభారంభం లభించింది. ఇక ఆస్ట్రేలియా తరఫున ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్ రవీంద్ర జడేజా 10 ఓవర్లలో 28 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

Sreleela : మా బాలయ్య ది చాలా మంచి మనస్సు..

ఇదిలా ఉంటే.. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు 1996 ప్రపంచకప్ తర్వాత తొలిసారి ప్రపంచకప్‌లో ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓడిపోయింది. గతసారి శ్రీలంక చేతిలో ఓడి ఆ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఈసారి భారత్ ఈ ఘనత సాధించింది. అంతా సవ్యంగా సాగితే ఈసారి భారత జట్టు సొంతగడ్డపై ఛాంపియన్‌గా నిలిచి మూడోసారి ట్రోఫీని అందుకుంటుంది.

 

Exit mobile version