Sreleela : మా బాలయ్య ది చాలా మంచి మనస్సు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’.. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటించింది. అక్టోబర్ 19న చిత్రం అన్ని భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. సన్ షైన్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ వరంగల్ గడ్డపై ఎంతో భారీగా జరుగుతోంది. ఈ ఈవెంట్ కు యంగ్ డైరెక్టర్స్ బాబీ, గోపీచంద్ మాలినేని, వంశీ పైడిపల్లి హాజరయ్యారు. అలాగే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా హాజరైంది. ఇక శ్రీలీలా ట్రెడిషనల్ లుక్ లో హాజరై ఎమోషనల్ స్పీచ్ తో ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా వేదికపై శ్రీలీలా మాట్లాడుతూ ఈ సినిమాలో నేను వరంగల్ పిల్లగా నటించాను. బ్యూటీఫుల్ స్టోరీలో విజ్జి పాపగా నటించాను. అలాగే ఇక్కడికి వచ్చాను. ఇంతంటి సోల్ కనెక్ట్ క్యారెక్టర్ ను అనిల్ రావిపూడి గారు నాకిచ్చారు. ఆయనకు బిగ్ థ్యాంక్యూ. నేను చాలా స్టోరీస్ పై సినిమాలు చేస్తున్నాను. కానీ ఈ పాత్ర నాకు ఎంతగానో కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా ను డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు చాలా బ్యూటీఫుల్ గా తీశారు.ఇక బాలకృష్ణగారితో నాకు ఎమోషనల్ టైమ్ ఉంది. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో అద్భుతం. ఈ చిత్రంలోని కొన్ని సీన్లు చేసేప్పుడు కట్ చెప్పినా కూడా అదే మూడ్ లో కంటిన్యూ అయ్యాను. ఆ సీన్ నుంచి వెంటనే బయటకి రాలేకపోయాను. అలాంటి సందర్భాల్లో నన్ను నవ్వించి నార్మల్ స్టేజీకి తీసుకొచ్చేవారు. నాకు ఎంతో సపోర్ట్ చేశారు.ఈ చిత్రంలో చాలా బ్యూటీఫుల్ సీన్లు ఉన్నాయి. సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా గుర్తుండిపోతాయి. ఇక బాలయ్య గారు నా లైఫ్ లో లేని అనుభవాలను ఈ సినిమా ద్వారా నాకు అందించారు. ఇది మీ మంచి మనస్సు అంటూ భావోద్వేగమైంది. తన క్యూట్ స్పీచ్ తో బాలయ్యను బాగా పొగిడేసింది.. అలాగే టెక్నిషీయన్లు కూడా అద్భుతంగా వర్క్ చేశారని తెలిపింది. ప్రతి ఒక్కరూ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశారంటూ ఆమె చెప్పుకొచ్చారు.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు