Indian Economy: జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. మొత్తం ప్రపంచ, ఆర్థిక వాతావరణం భారతదేశానికి అనుకూలంగా ఉందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. నేడు మనం $4,000 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించామన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి డేటాను ఉటంకిస్తూ.. నేడు భారతదేశం జపాన్ ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దదని నీతి ఆయోగ్ సీఈవో పేర్కొన్నారు.
Read Also: AlluArjun : అల్లు అర్జున్ అట్లీ మూవీలో నాని హీరోయిన్.. ?
అయితే, అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారత్ కంటే ముందు ఉన్నాయని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. మనం మన ప్రణాళిక, ఆలోచనకు కట్టుబడి ఉన్నాం.. రెండున్నర నుంచి మూడు ఏళ్లలోనే మనం మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని పేర్కొన్నారు. ఐఫోన్ కంపెనీ ఆపిల్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటనపై అడిగిన ప్రశ్నకు నీతి ఆయోగ్ సీఈవో సమాధానమిస్తూ, “టారిఫ్ రేట్లు ఎలా ఉంటాయో అనిశ్చితంగా ఉంటుంది.. కానీ పరిస్థితులు మారుతున్న తీరును బట్టి, మేము తయారీకి చౌకైన ప్రదేశంగా మారతామన్నారు. భారత్ తో పాటు మరెక్కడా ఆపిల్ ఐఫోన్లు తయారీ కేవలం అమెరికాలోనే ఉత్పత్రి అవుతుందని తాను ఆశిస్తున్నానని ట్రంప్ అన్నారు. నీతి ఆయోగ్ సీఈఓ కూడా ఆస్తుల మానిటైజేషన్ రెండవ దశను రెడీ చేస్తున్నామని.. దాన్ని ఆగస్టులో ప్రకటిస్తామని వెల్లడించారు.
Read Also: Shashi Tharoor: ఉగ్రవాదం ప్రపంచానికి అతి పెద్ద సమస్య.. పాక్పై శశిథరూర్ ఫైర్!
ఇక, 2025 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండవచ్చు అని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం చెప్పుకొచ్చారు. అంటే ఈ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుంది. వ్యవసాయం, హోటళ్ళు, రవాణా, నిర్మాణం లాంటి రంగాల బలమైన పని తీరు ఈ పెరుగుదలకు కారణం అన్నారు. ఈ సమాచారం కేర్ ఏజ్ రేటింగ్స్ అనే సంస్థ రిపోర్టులో పేర్కొనింది. నివేదిక ప్రకారం, పట్టణ, గ్రామాల్లో ప్రజల షాపింగ్ పెరిగిపోయింది. ఇది వినియోగాన్ని మరింత బలపరిచింది.