Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో తుది పోరుకు సర్వం సిద్ధమైంది. టైటిల్ పోరులో టీమిండియా-ఏ జట్టుతో తలపడే ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. లీగ్ దశలో జరిగిన చావోరేవో తేల్చుకోవాల్సిన కీలక మ్యాచ్‌లో శ్రీలంక-ఏ జట్టు సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. అఫ్గానిస్థాన్-ఏ జట్టుపై 103 పరుగుల భారీ తేడాతో లంక ఘన విజయం సాధించి, సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టుకు ఓపెనర్లు నిరోషన్ డిక్వెల్లా, అవిష్క ఫెర్నాండో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అఫ్గాన్ బౌలర్లను ఆడుకుంటూ మొదటి వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. డిక్వెల్లా (66) అవుటైనా.. అవిష్క ఫెర్నాండో (110) అద్భుత శతకంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. నువానిదు ఫెర్నాండో (45) అతనికి చక్కని సహకారం అందించాడు. చివరి ఓవర్లలో రవిందు ఫెర్నాండో వేగంగా ఆడటంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 322 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ 4, సాఫి 3 వికెట్లు పడగొట్టారు.
Also Read
- RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
- BCCI: బంగ్లాదేశ్ సిరీస్‌లపై స్పందించిన బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పర్యటనలు..
- Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఇక దూసుకెళ్లుడే..
- Rohit Sharma and Virat Kohli: 2027 వరల్డ్‌కప్‌లో రోహిత్, విరాట్ ఉంటారా?.. బీసీసీఐ సమాధానంపై ఆసక్తికర చర్చ
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్.. ఫైనల్ చేరాలంటే ఈ టార్గెట్‌ను 29.3 ఓవర్లలోనే పూర్తి చేయాల్సి ఉంది. కానీ రన్‌రేట్ ఒత్తిడిలో అఫ్గాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్ హస్సన్ ఐసాఖిల్ (74), ఫార్మనుల్లా సాఫి (43) పోరాడినా ఫలితం లేకపోయింది. లంక బౌలర్ దులాజ్ 5 వికెట్లతో అఫ్గాన్ నడుం విరవగా, మథులన్ 3 వికెట్లతో చెలరేగాడు. దీంతో అఫ్గాన్ 42.5 ఓవర్లలో 219 పరుగులకే కుప్పకూలి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
తాజావార్తలు
-
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
-
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
-
BCCI: బంగ్లాదేశ్ సిరీస్‌లపై స్పందించిన బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పర్యటనలు..
-
Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్‌డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?