IND W vs PAK W No Handshake: ‘నో హ్యాండ్ షేక్’.. రికార్డ్ విజయం సాధించిన టీమిండియా ప్లేయర్స్ నేరుగా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND W vs PAK W No Handshake: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 (ICC Women’s T20 World Cup 2026)ను భారత మహిళల జట్టు భారీ విజయంతో మొదలు పెట్టింది. ఆదివారం నాడు జరిగిన గ్రూప్-A మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమిండియా ఆధిపత్యం చెలాయించడంతో 64 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై భారత జట్టు సాధించిన అతిపెద్ద విజయంగా నమోదైంది.
మ్యాచ్ ముగిసిన వెంటనే భారత ఆటగాళ్లు మైదానంలో సంబరాలు జరుపుకున్నారు. పాకిస్థాన్ చివరి వికెట్ కోల్పోవడంతో భారత జట్టు ఆటగాళ్లు ఒక గుంపుగా చేరి విజయోత్సాహాన్ని పంచుకున్నారు. అయితే మ్యాచ్ అనంతరం సాధారణంగా ఆటగాళ్ల మధ్య జరిగే హ్యాండ్ షేక్ లేదా పరస్పర అభినందనలు ఈసారి కూడా ఎక్కడా కనిపించలేదు. టాస్ సమయంలో కూడా ఇరు జట్ల కెప్టెన్స్ కూడా కరచాలనం చేయలేదు.
Also Read
- CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
- Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
భారత ఆటగాళ్లు కేవలం అంపైర్లు, మ్యాచ్ అధికారులతో మాత్రమే కరచాలనం చేసి డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లిపోయారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ల్లో ఇదే తరహా పరిస్థితి కొనసాగుతోంది. ఈ తరహా వ్యవహారం 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకలో జరిగిన భారత్, పాక్ మ్యాచ్‌లో మొదటిసారిగా ఈ పరిస్థితి కనిపించగా.. ఇప్పుడు వరుసగా రెండో ఐసీసీ టోర్నమెంట్లోనూ అదే కొనసాగింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే ప్రసారకర్తలతో మాట్లాడిన ఆమె.. పాక్ కెప్టెన్ ఫాతిమా సనాతో సంప్రదాయ కరచాలనం చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి, అనంతరం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ‘నో హ్యాండ్ షేక్ పాలసీ’ ఒక సాధారణ దృశ్యంగా మారింది. పురుషుల క్రికెట్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
మాజీ భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మధ్య జరిగిన పలు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ హ్యాండ్ షేక్ కనిపించలేదు. 2026 పురుషుల టీ20 ప్రపంచకప్‌తో పాటు అండర్-19 ప్రపంచకప్, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నమెంట్‌ల్లో కూడా ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం పరస్పర కరచాలనాలకు దూరంగా ఉన్నారు.
🚨 NO HANDSHAKE BETWEEN INDIA AND PAKISTAN 🚨
– As soon as, Deepti Sharma took the last wicket, the Indian women's team celebrated the victory and went straight towards the dugout and had the handshake with Indian coaching staff and umpires 👏#INDvsPAK pic.twitter.com/ra7HgWd8Sm
— Ajay Jadeja (@AjayJadeja171) June 14, 2026
తాజావార్తలు
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!