Virat Kohli Century: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ ఆలౌట్! విండీస్ స్కోర్ 86/1
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs WI 2nd Test Day 2 Highlights: తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో తక్కువ స్కోరుకే ఆలౌటై ఇన్నింగ్స్ తేడాతో ఓడిన వెస్టిండీస్.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మాత్రం కాస్త ప్రతిఘటిస్తోంది. రెండో రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి విండీస్ 86/1 స్కోరుతో నిలిచింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (37), కిర్క్ మెకంజీ (14) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో కరేబియన్ జట్టు ఇంకా 352 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది.
ఓవర్ నైట్ స్కోరు 288/4తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియాకు మంచి ఆరంభమే దక్కింది. 87 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో రెండో రోజు ఆడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (121; 206 బంతుల్లో 11 ఫోర్లు) సెంచరీ చేశాడు. 180 బంతుల్లో శతకం బాదాడు. దాంతో కోహ్లీ నాలుగున్నరేళ్ల తర్వాత విదేశీ గడ్డపై సాధించాడు. ఆపై మొదటి రోజు 36 పరుగులు చేసిన జడేజా (61; 152 బంతుల్లో 5 ఫోర్లు) కూడా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. రనౌట్‌గా వెనుదిరిగాడు. కొద్దిసేపటికే జడేజా క్యాచ్ ఔట్ అయ్యాడు.
Also Read
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు!
విరాట్ కోహ్లీ, ఆర్ జడేజా స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరినా.. ఆర్ అశ్విన్ (56; 78 బంతుల్లో 8 ఫోర్లు) అర్ధ శతకంతో జట్టును అందుకున్నాడు. ఇషాన్ కిషన్ (25), జయదేవ్ ఉనద్కత్ (7)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఇషాన్, ఉనద్కత్, మొహ్మద్ సిరాజ్ (0)లు పెవిలియన్ చేరడంతో ధాటిగా ఆడిన అశ్విన్.. హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. యాష్ బౌల్డవడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, వారికన్ తలో మూడు వికెట్లు పడగొట్టారు.
భారత్ ఆలౌటైన అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఓపెనర్లు క్రైగ్ బ్రాత్‌వైట్, త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (33) శుభారంభం ఇచ్చారు. ఆరంభంలో బ్రాత్‌వైట్ నిలకడగా ఆడినా.. త్యాగ్‌నారాయణ్ బౌండరీలు బాదాడు. అయితే ఊపుమీదున్న చందర్‌పాల్.. జడేజా బౌలింగ్‌లో అశ్విన్‌కు చిక్కాడు. దీంతో 71 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన మెకంజీ ఓ సిక్స్, ఫోర్ బాదిన అనంతరం రెండో రోజు ఆట ముగిసింది.
Also Read: Owaisi: మణిపూర్ హింసాకాండపై ఒవైసీ ఫైర్.. మోడీ ఇమేజ్ గురించి భయపడుతున్నారు
తాజావార్తలు
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?