Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayush Mhatre About భారత అండర్-19 జట్టు 2026 ప్రపంచ కప్‌లో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌ను ఫైనల్లో 100 పరుగుల తేడాతో ఓడించి ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్ అత్యధికసార్లు అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టుగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. ఈ విజయ ప్రస్థానంలో కెప్టెన్ అయుష్ మాత్రేతో పాటు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించారు.
ఈ టోర్నీకి ముందు కెప్టెన్ అయుష్ మాత్రేకు టీమిండియా మాజీ సారథి, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కీలక సూచనలు ఇచ్చాడు. ఈ విషయాన్ని అయుష్ తాజాగా స్వయంగా వెల్లడించాడు. తనకు నాయకత్వంపై రోహిత్ భాయ్ ఎన్నో విషయాలు చెప్పాడని వెల్లడించాడు. ‘ఐపీఎల్ అనంతరం నేను అండర్-19 జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యా. నాయకత్వ బాధ్యతలపై నాకు పెద్దగా అవగాహన లేదు. దీంతో రోహిత్ శర్మను సంప్రదించాలని నిర్ణయించుకున్నా. రోహిత్‌కు మెసేజ్ చేయగా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ లేదా మెసేజ్ చేయొచ్చని చెప్పాడు’ అని అయుష్ వెల్లడించాడు.
Also Read
- Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
- 2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
- ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
- Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
‘ఆ తర్వాత రోహిత్‌ను వ్యక్తిగతంగా కలవాలని కోరాను. నన్ను ఇంటికి రావాలని ఆహ్వానించాడు. రోహిత్‌తో చాలా సమయం నాయకత్వానికి సంబంధించిన విషయాలపై మాట్లాడాను. కెప్టెన్‌గా జట్టును ఎలా నడిపించాలి, ఆటగాళ్లను ఎలా హ్యాండిల్ చేయాలి వంటి విషయాలను చాలా చక్కగా నాకు వివరించాడు. ఎంతో సమయం కేటాయించి నాతో మాట్లాడాడు. నా తండ్రితో కూడా దాదాపు అరగంట మాట్లాడాడు. రోహిత్ చాలా వినయంగా ఉంటాడు. ఎప్పుడూ మాట్లాడేందుకు అందుబాటులో ఉంటాడు’ అని అయుష్ మాత్రే చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీకి సంబంధించిన సూచనలతో పాటు రోహిత్ ఇచ్చిన ప్రోత్సాహం కూడా తనకు ఎంతో ఉపయోగపడిందని అయుష్ చెప్పాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో తన ప్రయాణం గురించి కూడా అయుష్ మాత్రే ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీని తొలిసారి చూసినప్పుడు భయపడ్డా. నిజమే చెపుతున్నా మాహీ భాయ్‌ను తొలిసారి ప్రత్యక్షంగా చూసినప్పుడు ఓ రకమైన భయంతో అలా చూస్తుండిపోయా. ఇప్పటికీ అలానే ఉంటుంది అనుకోండి. ఆయన చాలా స్వేచ్ఛగా మాట్లాడతారు. మహీ భాయ్ ఒక లెజెండ్. ఆయనతో ఫొటో దిగాలని అనుకున్నా.. ఎలా దగ్గరకు వెళ్లాలో అర్థం కాలేదు. ట్రయల్స్ చివరి రోజు ధైర్యం చేసి వెళ్లి ఫొటో దిగాను. అయితే అప్పట్లో ధోనీతో నేను పెద్దగా మాట్లాడలేదు’ అని అయుష్ తెలిపాడు. 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన అయుష్ ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 441 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోరు 94. అండర్-19 ప్రపంచ కప్ విజయంతో మరింత గుర్తింపు తెచ్చుకున్న అయుష్.. రాబోయే ఐపీఎల్ సీజన్లోనూ తన సత్తా చాటాలని చూస్తున్నాడు.
తాజావార్తలు
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?