Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijeet Dipke: గాంధీ జయంతి (అక్టోబర్ 2) నాడు ఒక వైవిధ్యమైన నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను గురువారం సాయంత్రం ముంబైలోని మెరైన్ డ్రైవ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత వదిలేసిన ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక, తన మద్దతుదారులతో కలసి ప్లకార్డులు పట్టుకుని మెరైన్ డ్రైవ్ వద్ద సందడి చేస్తున్న అభిజీత్ వద్దకు ఒక మహిళా ఇన్స్పెక్టర్ నాయకత్వంలోని పోలీస్ టీమ్ వెళ్లింది. ఆయనను పోలీస్ వ్యాన్ ఎక్కించి మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆ మహిళా అధికారి అభిజీత్ వివరాలు, సొంత ఊరు గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై ముంబై పోలీసుల వెర్షన్ వేరేలా ఉంది. తాము అభిజీత్‌ను అసలు అరెస్ట్ కానీ, నిర్బంధించడం కానీ చేయలేదని పోలీసులు చెబుతున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఆయన మెరైన్ డ్రైవ్ వద్ద ప్రజలను కలుస్తూ, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులను రకరకాల ప్రశ్నలు అడుగుతుంటే మాట్లాడటానికి మాత్రమే స్టేషన్‌కు తీసుకెళ్లామని అధికారులు స్పష్టం చేశారు.
అయితే, అభిజీత్ దిప్కే మాత్రం ఈ ఉదంతంపై పోలీసులతో విభేదిస్తూ పూర్తి భిన్నమైన కథనాన్ని వినిపించారు. ఆ మహిళా పోలీస్ ఆఫీసర్ తన వద్దకు వచ్చి “పదండి.. ఒక టీ తాగుదాం, మీకు మా వద్ద ‘చాయ్’ బాకీ ఉంది” అని చెప్పి మరీ స్టేషన్‌కు తీసుకెళ్లారని ఆయన అన్నారు. కానీ, తీరా స్టేషన్‌కు తీసుకెళ్లాక టీ ఇవ్వకపోగా, కేవలం తన విలువైన సమయాన్ని వృథా చేయడానికే పోలీసులు ఇలా చేశారని అభిజీత్ ఆరోపించారు. పైఅధికారుల నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చి ఉంటాయేమో, అందుకే తనను ఏమీ అనకుండానే పంపించేశారని వ్యాఖ్యానించారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక, ఆయన చెంబూరులోని అంబేడ్కర్ హాస్టల్లో విద్యార్థులతో నిర్వహించిన సమావేశానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read
- Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
అసలు ఈ రచ్చంతా అక్టోబర్ 2న సీజేపీ చేపట్టిన నిరసన చుట్టూనే తిరుగుతోంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ నిరసనను తలపెట్టారు. అయితే, ప్రసిద్ధ శివాజీ పార్క్ వద్ద జనసమీకరణపై ఉన్న ఆంక్షలు, స్థానిక మున్సిపల్ అధికారుల నుంచి అనుమతి లేకపోవడం, ట్రాఫిక్ సమస్యలతో పాటు అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతుందనే కారణాలతో ముంబై పోలీసులు ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?