Virat Kohli to play against Tagenarine Chanderpaul in IND vs WI 1st Test: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత్ తొలి పోరుకు సిద్దమైంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. డొమినికా వేదికగా బుధవారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్‌తోనే 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్ ప్రారంభం కానుంది. దాంతో మ్యాచ్ గెలిచి శుభారంభం చేయాలని చూస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్ ముంగిట భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
విరాట్ కోహ్లీ 12 ఏళ్ల క్రితం వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసినప్పుడు ఆ జట్టు సీనియర్ ప్లేయర్ శివనారాయణ్ చంద్రపాల్‌తో ఆడాడు. ఇప్పుడు చంద్రపాల్ విండీస్ జట్టులో లేకున్నా.. కుమారుడు త్యాగ్‌నారాయణ్ చంద్రపాల్ జట్టులో ఉన్నాడు. నేడు త్యాగ్‌నారాయణ్ బరిలోకి దిగనున్నాడు. నేడు త్యాగ్‌నారాయణ్ మైదానంలోకి వస్తే.. తండ్రి, కొడుకుతో ఆడిన ఆటగాడిగా కోహ్లీ ఓ ప్రత్యేక క్లబ్‌లో చేరతాడు.
Also Read: Toyota Fortuner Price 2023: 15 లక్షలకే టయోటా ఫార్చ్యూనర్.. క్షణాల్లో డెలివరీ కూడా!
తండ్రి, కొడుకుతో ఆడిన ఆటగాడిగా ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ మాత్రమే ఉన్నాడు. సచిన్ తన సుదీర్ఘ కెరీర్‌లో తండ్రీ కొడుకులను ఎదుర్కొన్నాడు. 1992లో ఆస్ట్రేలియా ప్లేయర్ జియోఫ్ మార్ష్‌తో సచిన్ ఆడాడు. 2012లోజియోఫ్ మార్ష్ కుమారుడు షాన్ మార్ష్‌తో ఆడాడు. ఈ రికార్డు ఒక్క సచిన్ పేరుపై మాత్రమే ఉంది. నేడు శివనారాయణ్ చంద్రపాల్ కుమారుడు త్యాగ్‌నారాయణ్ చంద్రపాల్ ఆడితే.. విరాట్ కోహ్లీ కూడా సచిన్ సరసన చేరతాడు.
వెస్టిండీస్ తరఫున శివనారాయణ్ చంద్రపాల్ 164 మ్యాచులు ఆడి.. 11867 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 203 నాటౌట్. ఇక త్యాగ్‌నారాయణ్ చంద్రపాల్ 6 మ్యాచ్‌లు ఆడి 45.30 సగటుతో 453 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 1 అర్ధ సెంచరీ ఉన్నాయి. 27 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన త్యాగ్‌నారాయణ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 207.