Purchase Used Toyota Fortuner Only Rs 15 Lakh in Spinny: జపాన్‌కు చెందిన ‘టయోటా’ కంపెనీకి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. టయోటా కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కార్లు రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా టయోటా కంపెనీకి చెందిన ‘ఫార్చ్యూనర్’కు భారత మార్కెట్‌లో భారీ క్రేజ్ ఉంది. అయితే అధిక ధర కారణంగా ఎక్కువ మంది కొనుగోలు చేయలేకపోతున్నారు. ఫార్చ్యూనర్ ధర రూ. 32.5 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ మోడల్ అయితే దాదాపుగా రూ. 45 నుంచి 50 లక్షల వరకు ఉంటుంది.
బడ్జెట్ తక్కువగా ఉండి, టయోటా ఫార్చ్యూనర్ కారు కొనాలనుకుంటున్నారా?.. అయితే ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. తక్కువ ధరలో మీరు ఫార్చ్యూనర్ కారును ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. కార్స్24 వెబ్‌సైట్‌లో సెకండ్ హ్యాండ్ ఫార్చ్యూనర్ కార్లు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. అన్నింటి ధర దాదాపు రూ.15 లక్షలుగా ఉంది. డెలివరీ కూడా వెంటనే ఉంటుంది. ఈ కార్లకు రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కారు కొన్నప్పుడే రోడ్డు పన్ను చెల్లించబడుతుంది. ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉన్న సెకండ్ హ్యాండ్ టయోటా ఫార్చ్యూనర్‌ల జాబితాను చూద్దాం.
2015 Toyota Fortuner 2.8 4×2 MT:
2015 టయోటా ఫార్చ్యూనర్ 2.8 4×2 MT ధర రూ. 15.57 లక్షలుగా కార్స్24 వెబ్‌సైట్‌లో ఉంది. డీజిల్ ఇంజన్ కలిగిన ఈ కారు 85,472 కిమీలు నడిచింది. ఇది మొదటి యజమాని. ఈ కారు మొదటి యజమాని వద్ద ఉండగా.. ఢిల్లీలో అమ్మకానికి అందుబాటులో ఉంది.
2015 TOYOTA FORTUNER 3.0 MT 4X4:
2015 టయోటా ఫార్చ్యూనర్ 3.0 MT 4X4 ధర మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వెబ్‌సైట్‌లో రూ. 14.95 లక్షల ధరకు అమ్మకానికి ఉంది. డీజిల్ ఇంజన్ గల ఈ కారు రీడింగ్ 136000 కిమీ. మొదటి యజమాని వద్ద ఉన్న ఈ కారు నోయిడాలో అమ్మకానికి ఉంది.
2014 Toyota Fortuner 4×2 AT:
స్పిన్నీ లోవెబ్‌సైట్‌లో 2014 టయోటా ఫార్చ్యూనర్ 4×2 AT ధర రూ. 12.79 లక్షలుగా ఉంది. 95,800 కిమీలు ప్రయాణించిన ఈ కారులో డీజిల్ ఇంజిన్ ఉంది. ఈ కారు నోయిడాలో అమ్మకానికి అందుబాటులో ఉంది.
2014 Toyota Fortuner 3.0 4×2 MT:
2014 టయోటా ఫార్చ్యూనర్ 3.0 4×2 MT కారు స్పిన్నీలో రూ. 12.49 లక్షల ధరకు అమ్మకానికి ఉంది. ఇది నోయిడాలో అమ్మకానికి ఉండగా.. డీజిల్ ఇంజన్ కలదు. ఈ కారు రీడింగ్ 81,500 కిలోమీటర్లు.
Also Read: Rashmika Mandanna Selfie: సెల్ఫీ కోసం ఎగబడ్డ ఫాన్స్.. అభిమాని చేసిన పని షాక్ తిన్న రష్మిక మందన్న!