Ishan Kishan vs KS Bharat: నేటి నుంచే వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. భారత జట్టులో తెలుగబ్బాయికి చోటు కష్టమే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan, KS Bharat in Race for India Wicketkeeper in IND vs WI 1st Test: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 ఓటమి తర్వాత భారత్ తొలి టెస్టు ఆడబోతోంది. వెస్టిండీస్‌తో నేటి నుంచి విండ్సర్ పార్క్ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అలానే జియో సినిమా, ఫ్యాన్‌కోడ్ యాప్‌లలో కూడా మ్యాచ్ లైవ్ చూడొచ్చు. తొలి మ్యాచ్‌లో గెలిచి డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో బోణీ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఫెవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే టీమ్ కాంబినేషన్‌పైనే ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.
తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. దాంతో శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ స్థానాన్ని వదులుకుని.. చేతేశ్వర్ పుజారా ఖాళీ చేసిన మూడో స్థానంలో ఆడబోతున్నాడు. ఇక నాలుగో స్థానంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఐదవ స్థానంలో వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఆడనున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ ఎవరనే సందేహం అందరిలో ఉంది. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్స్ రేసులో కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ ఉన్నారు. వీరిలో ఒకరికి అవకాశం దక్కనుంది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Also Read: Bank Scheme: రిస్క్ లేకుండా.. రూ.5 లక్షలు పొందే సూపర్ స్కీమ్..
ఇప్పటివరకు ఆడిన 5 టెస్టుల్లో ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ 8 ఇన్నింగ్స్‌ల్లో 129 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయకపోగా.. 18.43 సగటుతో మాత్రమే రన్స్ సాధించాడు. భరత్ వికెట్ల వెనుకాల మెరుగ్గానే రాణిస్తున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం తడబడుతున్నాడు. గత ఐదు టెస్టుల్లో విఫలమైన భరత్‌కు ఈసారి చివరి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఈ టెస్టులో కూడా విఫలమైతే.. రెండో టెస్టు మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
రిషబ్ పంత్ గాయం అనంతరం ఈ ఏడాది ఆరంభం నుంచి భారత్ తరపున కేఎస్ భరత్ కీపింగ్ చేస్తున్నాడు. దాంతో మెరుగ్గా రాణిస్తున్న ఇషాన్ కిషన్ బెంచ్‌పైనే ఉన్నాడు. భరత్, ఇషాన్ ఈసారి కూడా జట్టులో ఉన్నారు. ఇషాన్ ఇప్పటివరకు టీమిండియా తరపున టెస్టు క్రికెట్‌లో ఆడలేదు. అందుకే వెస్టిండీస్‌తో సిరీస్‌లో అరంగేట్రం చేసేందుకు ఎదురు చూస్తున్నాడు. ఇషాన్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. దాంతో తొలి టెస్టు మ్యాచ్‌లో ఇషాన్‌కు అదృష్టం కలిసొస్తుందా లేక భరత్‌కు మరో అవకాశం వస్తుందా (Ishan Kishan vs KS Bharat) అనేది చూడాలి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!